Big Stories

Skill Development Case: సుప్రీంలో బాబు బెయిల్ రద్దు పిటిషన్.. విచారణ వాయిదా..

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మే 7 కి వాయిదా వేసింది. బెయిల్ రద్దు పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేదీ, జస్టిస్ పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. కాగా ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని ఏపీ సీఐడీ అధికారులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

- Advertisement -

విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది రంజిత్ కుమార్., చంద్రబాబుకు వ్యతిరేకంగా ఛార్జిషీటు ధాఖలు అయినట్లు కోర్టుకు తెలిపారు. అటు చంద్రబాబు కుమారుడు లోకేష్ తాము అధికారంలోకి వచ్చాక ఇన్వెష్టిగేషన్ అధికారుల సంగతి చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. దీంతో ఈ అంశంపై ఇంటర్‌లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేశామని అడ్వకేట్ రంజిత్ కుమార్ స్పష్టం చేశారు.

- Advertisement -

ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేష్ వీటిపై ప్రసంగాలు చేస్తున్నారని రంజిత్ కుమార్ కోర్టుకు తెలియజేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్ డైరీలో ఉన్న అధికారులను సస్పెండ్ చేస్తామని.. వారిపై చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ బెదిరిస్తున్నారని ఆయన కోర్టుకు తెలిపారు. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని.. వెంటనే ఆయన బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు.

కాగా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ్ లూత్రా చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని తెలిపారు. లోకేష్ మాట్లాడితే చంద్రబాబు ఎలా ఉల్లంఘించినట్లు అవుతుందని లూత్రా కోర్టుకు తెలియజేశారు.

Also Read: చంద్రబాబుపై మరో కేసు.. కోర్టులో పీటీ వారెంట్..

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని అనడానికి లేదని పేర్కొంది. ఈ అంశంపై తదుపరి విచారణను మే 7 కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇక లోకేష్ అధికారులను బెదిరిస్తున్నారన్న అంశాన్ని లిస్ట్ చేయాలని కోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ధర్మాసనం సూచించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News