టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై మరో కేసు కలకలం రేపుతోంది. విజయవాడ ACB కోర్టులో ఆయనపై మరో పిటిషన్ దాఖలైంది. సీఐడీపై ఈ పిటిషన్ వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ పిటిషన్ ను సీఐడీ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టు అయ్యారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో మరోకేసును సీఐడీ తెరపైకి తేవడం ఆసక్తిని రేపుతోంది. ఈ కేసులోనూ చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2022లో నమోదైన కేసులో టీడీపీ అధినేతను విచారించేందుకు కోర్టు అనుమతి సీఐడీ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A1గా చంద్రబాబు, A2గా మాజీ మంత్రి నారాయణ, A6గా మరో మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌లో సీఐడీ పేర్కొంది.