Big Stories

Rajinikanth: ప్రముఖ నటుడు, నిర్మాత మృతి.. ఎమోషనల్ అయిన రజినీకాంత్

Rajinikanth: కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత ద్వారకీష్(81) గుండెపోటుతో మృతి చెందాడు. గతకొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనకు ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక 1963 లో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన స్టార్ హీరోసినిమాల్లో మొదట కమెడియన్ గా నటించాడు. దాదాపు 150 పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ద్వారకీష్.. నిర్మాతగా కూడా కొనసాగాడు.

- Advertisement -

తెలుగులో హిట్ టాక్ అందుకున్న పరమానందయ్య శిష్యులు, రామాయణం లో పిడకల వేట లాంటి సినిమాలను కన్నడలో రీమేక్ చేశాడు. ఇక విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమాను కన్నడలో రీమేక్ చేసింది ఆయనే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాల ద్వారా ద్వారకీష్ మంచి గుర్తింపును అందుకున్నాడు. ఆయన మృతితో కన్నడ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇక తాజాగా ద్వారకీష్ మృతిపై సూపర్ స్టార్ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా ఆయనను గుర్తుచేసుకున్నారు. ” నా చిరకాల మిత్రుడు ద్వారకేష్ మృతి చెందడం నాకు చాలా బాధాకరంగా ఉంది..కమెడియన్‌గా కెరీర్‌ని ప్రారంభించి పెద్ద నిర్మాతగా, దర్శకుడిగా ఎదిగిన ఆయనను తలుచుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి.. ఆయన కుటుంబానికి, మరియు ప్రియమైనవారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News