ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజల ఫోకస్ అంత మంచు వారి ఇంటి మీదే ఉంది. ఇది అన్నదమ్ముల పోట్లాట? లేదా తండ్రి కొడుకుల గొడవా అనేది క్లారిటీ రాకపోవడం క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి బాగా పెరిగిపోయింది. పైగా.. అమెరికాలో ఉంటున్న విష్ణు కూడా హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చేశాడు. రావడం రావడంతోనే.. మోహన్ బాబు ఇంట్లో ఉన్న మనోజ్, అతడి బాడీ గార్డులను బయటకు గెంటేశాడు. ఈ విషయంలో తాను తగ్గేదేలే అన్నట్లుగా మంచు మనోజ్ ఇప్పుడు డీజీపీని కూడా ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకే.. ఇదంతా ఫ్యామిలీ ఎపిసోడ్. కాసేపు దీన్ని పక్కన బెడదాం. అయితే, అటు మనోజ్.. ఇటు మోహన్ బాబు అంత స్ట్రాంగ్‌గా పోట్లాడుకోవడానికి కారణం.. వారి వెనుక ఉన్న రాజకీయ పార్టీలేనట.
విష్ణుకు వైసీపీ సపోర్ట్?
ఔనండి.. బయట వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, మోహన్ బాబు.. మనోజ్ మధ్య గొడవ గురించి తెలియగానే మంచు విష్ణు అలర్ట్ అయ్యాడట. తాను అమెరికాలో ఉన్నా.. హైదరాబాద్‌లో వ్యవహారాలను చాలా చాకచక్యంగా చక్కబెట్టేశాడట. ఏదో విషయం మీద మోహన్ బాబు, మనోజ్ మధ్య మాటమాట పెరిగిందని, ఈ సందర్భంగా మనోజ్‌ను మరో వ్యక్తి నెట్టాడని, ఆ కోపంతో మనోజ్.. తన తండ్రితో కలబడ్డాడు అనేది ఆ ఇంట్లో పని మనిషి చెప్పిన వెర్షన్. అయితే, వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది తెలియరాలేదు. ఈ విషయం తెలియగానే విష్ణు వెంటనే తనకు తెలిసిన వైసీపీ నేతలను సంప్రదించి.. మనుషులను పురమాయించాడట. వెంటనే వాళ్లు అక్కడికి వచ్చి సీసీటీవీ కెమేరాల హార్డ్ డిస్కులు మాయం చేశారని తెలిసింది. అయితే, వాళ్లే మనోజ్‌ను కొట్టారా? లేదా అంతకు ముందే మనోజ్‌కు దెబ్బలు తగిలాయా అనేది క్లారిటీ లేదు. కానీ, వచ్చింది మాత్రం వైసీపీ మనుషులే అనే ప్రచారం సాగుతోంది.
మనోజ్‌కు టీడీపీ మద్దతు!
మంచు విష్ణుకు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా దగ్గర కూడా. విరానికాతో పెళ్లి తర్వాత జగన్‌తో బంధుత్వం ఏర్పడింది. వరసకు జగన్ ఆయనకు బావ అవుతారని ఓ సందర్భంలో విష్ణు తెలిపాడు. దానివల్ల వైసీసీ నేతలు కూడా మంచు ఫ్యామిలీకి దగ్గరయ్యారు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా మోహన్ బాబును కలుస్తుంటారు. అందుకే, మోహన్ బాబుకు కష్టం వచ్చిందని చెప్పగానే ఆగమేఘాలపై వాలిపోయి మరీ ఆదుకున్నారని సమాచారం. మరి, ఈ విషయం తెలిసిన తర్వాత మనోజ్ ఊరుకుంటాడా వెంటనే.. తన భార్య మౌనికా ద్వారా టీడీపీ నేత, ఆమె సోదరి భూమా అఖిల ప్రియకు కబురు చేశాడట. వెంటనే ఆమె కూడా తన సోదరి కోసం మనుషులను పంపించి.. వారికి భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అలా ఒకరకంగా ఇది వైసీపీ vs టీడీపీ వార్‌గా మారిపోయింది. ఇప్పుడు కూడా ఇరువర్గాలు తగ్గేదేలే అన్నట్లుగానే ఉన్నాయి. ఇందుకు కారణం కూడా వారి వెనుక ఉన్న పొలిటికల్ బలం. అలాగే మోహన్ బాబు తెలంగాణలో బీఆర్ఎస్ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి.
Also Read: భూమా మౌనిక వల్లే మంచు ఫ్యామిలీలో గొడవలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన పనిమనిషి