Game Changer Movie Poster : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా శంకర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది. శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ చేసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. పాన్ ఇండియా స్థాయి కంటెంట్ ను శంకర్ తన కెరీర్ లో ఇదివరకే అందించాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా అప్పట్లో సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సినిమాకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఇక్కడితో శంకర్ మీద ఉన్న నమ్మకాలన్నీ చాలామందికి చచ్చిపోయాయి. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి శంకర్ కథ కాదు కాబట్టి కొంత ఉపశమనం కలిగింది అనేది కొంతమంది అభిప్రాయం. ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉన్నట్లు సమాచారం వినిపిస్తుంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చరణ్ పూర్తిస్థాయిలో కనిపిస్తున్న సినిమా ఇది. అంతేకాకుండా ఈ సినిమాలు చరణ్ చాలా గెటప్స్ లో కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఈ కథను కార్తీక్ సుబ్బరాజు సిద్ధం చేశాడు. అయితే ఈ స్టోరీ ఫినిష్ చేసిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇది కథ చాలా బాగుంది ఇది శంకర్ సార్ రేంజ్ లో ఉంది అని చెప్పడం మొదలుపెట్టారు. దీనితో కార్తీక్ సుబ్బరాజు కూడా ఈ సినిమాను శంకర్ సార్ కు ఇద్దాం అని ఫిక్స్ అయి శంకర్ చేతిలో పెట్టారు. అయితే శంకర్ ఈ కథను భారీ స్థాయిలో తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే అధికారికంగా ప్రకటించారు.
Also read : Manchu Family Issue: మంచు ఫ్యామిలీలో జరుగుతుంది ఆస్తుల వివాదం కాదు.. ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కామెంట్స్
ఇంకా కేవలం ఈ సినిమాకు 30 రోజులు మాత్రమే టైం ఉంది. ఇదివరకే ఈ సినిమా నుంచి వచ్చిన మూడు పాటలు కూడా అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రామ్ నందన్ మరో 30 రోజుల్లో ఛార్జ్ తీసుకోబోతున్నాడు అంటూ రాసుకొచ్చారు. ఇక ఈ పోస్టర్ లో రామ్ చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటే కాలేజ్ నుంచి రామ్ చరణ్ ఎగ్జిట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా ఈ సినిమా మీద మంచి అంచనాలు కొంతమందికి ఉన్నాయి. బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అంటూ పోస్ట్స్ పెడుతున్నారు. మరి ఏది నిజమవుతుందో జనవరి 10న తేలనుంది.
30 days for the Game to Change and the #GameChanger to take charge 🤙🏼🔥
The Global mass mania will begin from 10th January 2025!#GameChangerOnJAN10 🚁
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/Y9GNNQXWPF
— Sri Venkateswara Creations (@SVC_official) December 10, 2024