E-Paper
Advertisement

ఎట్టకేలకు శుభవార్త.. తల్లికి వందనం నిధులపై క్లారిటీ.. ఆ మూడు రోజుల్లో ఖాతా చెక్ చేసుకోండి

ఎట్టకేలకు శుభవార్త.. తల్లికి వందనం నిధులపై క్లారిటీ.. ఆ మూడు రోజుల్లో ఖాతా చెక్ చేసుకోండి
Advertisement

Thalliki Vandanam Scheme: విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకం ‘తల్లికి వందనం’. ఈ పథకం ద్వారా పేద-మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం చేస్తుంది. తాజాగా ఈ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం, నిధులు ఎప్పుడు విడుదల చేస్తామనే దానిపై క్లారిటీ ఇచ్చేసింది. జులై 16 నుంచి 18 మధ్య డబ్బుల జమ కానున్నాయి.

తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం క్లారిటీ

Advertisement

కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం పథకం’ గురించి శుభవార్త. విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ పథకం నిధులపై ఓ క్లారిటీ వచ్చేసింది. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ చల్లటి కబురు చెప్పారు. ఈనెల 16 నుంచి 18 మధ్య తల్లికి వందనం రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.

శ్రీకాళహస్తిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో తల్లిదండ్రుల ముఖంలో ఆనంద మొదలైంది. జూలై మూడో వారంలో మేగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ జరగబోతోంది. ఈ సందర్భంలో తల్లికి వందనం నిధులు కూడా విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు సాధించిన విజయాలపై డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారభించబోతున్నట్లు తెలిపారు.

Advertisement

ఈనెల 16 నుంచి 18 మధ్య నిధులు విడుదల.. టీచర్స్-పేరెంట్స్ మీటింగ్ కూడా

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద విద్యార్థులకు అండగా నిల్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతీ విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నిధులను నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.

రూ.15 వేలులో రూ.13 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. మరో రెండు వేలు విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో విద్య అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. మరోవైపు ఈ ఏడాది దరఖాస్తుల్ని పాఠశాలల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు అధికారులు.

ALSO READ: హీరో సంస్థను ఏపీకి ఎలా తెచ్చానో తెలుసా? తిరుపతిలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

స్వర్ణ గ్రామ-వార్డు కార్యాలయాల ఉద్యోగులు ఈ పనిలో బిజీగా ఉన్నారు. పరిశీలన తర్వాత అర్హులను గుర్తించి తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణ గ్రామ-వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు.ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది ప్రభుత్వం.

Related News

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

పీపీపీ పేరుతో రాష్ట్రం అమ్మకానికి? చంద్రబాబు, లోకేష్‌లపై పేర్ని నాని సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×