E-Paper
Advertisement

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం

టీడీపీలో అనూహ్య నిర్ణయం.. 22 ఏళ్లుగా పార్టీకోసం చేసిన కృషికి సీఎం సంచలన నిర్ణయం
Advertisement

Dalavai Ramadevi: పార్టీ కోసం నిబద్దతతో పని చేసిన వారికి పదవులు దక్కుతాయని టీడీపీ మరోసారి నిరూపించింది. అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కెబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

పెద్దల సభకు..

పార్టీ అప్పగించిన పనిని తూచా తప్పకుండా పాటిస్తూ నిబద్దతతో పని చేసే రమాదేవిని పెద్దల సభకు పంపుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ టీడీపీ అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా, అనంతపురం నగరంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గా రమాదేవి పార్టీకి సేవలందిస్తున్నారు.

Advertisement

Also Read: మత్స్యకారుడిపై ఆక్టోపస్ దాడి.. ముఖాన్ని చుట్టేసి చిత్రవధ.. వీడియో వైరల్!

వడ్డెర సామాజిక వర్గం..

ఎవ్వరూ ఊహించని విధంగా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన దళవాయి రమాదేవి సేవలను గుర్తిస్తూ ఎమ్మెల్సీగా ఛాన్స్ఇవ్వడం సంచలనంగా మారింది. చాలా మంది రేసులో ఉన్నా.. కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ ఎమ్మెల్సీగా రమాదేవికి అవకాశం టీడీపీ అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల పార్టీ కమిటీల కూర్పులోనూ ఓ మండల పార్టీ అధ్యక్షురాలికి.. క్లస్టర్ ఇన్ఛార్జీకి పొలిట్ బ్యూరోలో స్థానంలో కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2024 ఎన్నికల్లో..

Advertisement

అదే ఒరవడిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలోనూ కొనసాగించారు. 22 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న రమాదేవి కుటుంబం టీడీపీ పార్టీకి సేవలందిస్తుంది. 2024 ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గెలుపునకు రమాదేవి కృషి చేసారు. పార్టీ కోసం పని చేస్తూ స్థానికంగా తెలుగుదేశం కుటుంబంగా రమాదేవి కుటుంబం పేరుతెచ్చుకున్నారు. 2021లో అనంతపురంలో 47వ డివిజన్ కార్పోరేటరుగా ఒత్తిళ్లను.. వేధింపులను తట్టుకుని పోటీ చేసి కేవలం 37 ఓట్ల తేడాతో రమాదేవి ఓడిపోయారు.

Also Read: 2025 జాతీయ క్రీడా పురస్కాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

Tags

Related News

అక్రమాలపై చర్చించే దమ్ములేక సీఎం భయపడుతున్నారా.. బొత్స సత్యనారాయణ

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!

మేమేం కుస్తీ పోటీలకు రావడం లేదు.. లోకేష్ సవాళ్లకు బొత్స కౌంటర్!

ఏపీ శాసనమండలిలో సీన్ రివర్స్.. పయ్యావుల పంచ్‌లకు వైసీపీ సైలెంట్!

ఏపీ అసెంబ్లీ డే-2.. నేడు సభలో చర్చించే కీలక అంశాలివే!

‘దమ్ముంటే అసెంబ్లీకి రండి’.. వైసీపీ నేతలకు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

ఏపీ అసెంబ్లీలో ఆటో మ్యుటేషన్ బిల్లు ఆమోదం!

Big Stories

Advertisement
×