E-Paper
Advertisement

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!

విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం.. కొత్త పార్టీతో మళ్లీ రాజకీయాల్లోకి!
Advertisement

Vijaya Sai Reddy:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో కొత్త సంచలనానికి తెరలేపారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతూ ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాన్ని వెల్లడించారు.

ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయం

Advertisement

రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలను పరిష్కరించడమే తమ ప్రధాన ఉద్దేశమని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజల గొంతుకను చట్టసభల్లో గట్టిగా వినిపించేందుకే ఈ కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాసనసభతో పాటు పార్లమెంట్‌లోనూ ప్రజల వాణిని బలమైన రీతిలో వినిపిస్తామని, ప్రజా సంక్షేమమే పరమావధిగా తమ పార్టీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ నెలలోనే భవిష్యత్ కార్యాచరణ

Advertisement

తమ పార్టీ పేరు, విధానాలు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించి, పార్టీ రూపకల్పన మరియు కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారు. గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన, ఈ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశారు.

Also Read: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వాహనం, ముగ్గురు మృతి!

Tags

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×