E-Paper
Advertisement

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు టెక్కీ మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు టెక్కీ మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు
Advertisement

America: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న యువతీయువకులు అక్కడ రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. కనీసం నెలకు ఒకరు చొప్పున తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించిన సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువ ఇంజనీర్ దిలీప్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు.

 

అమెరికా ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కడప జిల్లాకు చెందిన ఓ యువ ఇంజనీర్ మృతి చెందాడు. మృతుడు సొంతూరు చిట్వేల్ మండలం, జెట్టివారిపల్లి గ్రామానికి చెందిన దిలీప్ కుమార్‌. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల మేరకు.. ఉన్నత చదువుల కోసం మూడేళ్ల కిందట అమెరికా వెళ్లాడు దిలీప్‌కుమార్. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు.

 

కడప జిల్లా టెక్కీ దిలీప్ కుమార్ మృతి

Advertisement

ఐదు నెలల కిందట ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆగష్టు 7న తన ఫ్రెండ్‌ని ఎయిర్‌పోర్టులో దించి తిరిగి వస్తున్నాడు. ఒహాయో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో దిలీప్ ప్రయాణిస్తున్న కారుని ఎదురుగా వస్తున్న ఓ పికప్ ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ కారు నుజ్జు నుజ్జు అయ్యింది.

కన్నీరు మున్నీరు అవుతున్న తల్లిదండ్రులు

స్పాట్‌లో దిలీప్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో దిలీప్ మృతి వార్త తెలియగానే అతడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. జట్టివారిపల్లెలో విషాదఛాయలు అలముకున్నాయి. దిలీప్ తల్లిదండ్రులు శ్రీహరి- చాముండి కన్నీరు మున్నీరుగా విలపించారు.

ALSO READ: అమ్మ గుర్తుకు రావడంతో.. భార్యను చంపి భర్త ఆత్మహత్య, తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

అమెరికాలో వీకెండ్ సెలవులు కావడంతో దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ రియాక్ట్ అయ్యింది. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని, భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.

Related News

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

Big Stories

Advertisement
×