E-Paper
Advertisement

పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!

పొలంలో వరి నాట్లు వేస్తుండగా పిడుగుపడి ఇద్దరు మృతి.. నలుగురికి తీవ్రగాయాలు!
Advertisement

Lightning Strike: శ్రీకాకుళం జిల్లా మందస లో దారుణం చోటు చేసుకుంది. పిడుగు పాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో నలుగురు మహిళకు గాయాలయ్యాయి. దీంతో ఈ సంఘటన కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెలితే.. శ్రీకాకుళం జిల్లా మందస మండలం పెడాంగో గ్రామంలో పిడుగుపాటు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొలంలో వరినాట్లు నాటుతుండగా పిడుగుపాటు పడి ఆరు మంది మహిళలు ప్రమాదానికి గురయ్యారు.

వరి నాట్లు వేస్తూ..

అయితే గత మూడు నాలుగు రోజులుగా జిల్లాలో భారీ వర్షాల కారణంగా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. దీంతో పెడాంగో గ్రామ పొలంలో ఈ ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు వరి నాట్లు నాటుతుండగా ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం వచ్చింది. దీంతో వర్షం కారణంగా సమీపంలో గల ఓ చెట్టు క్రిందకు మహిళలు వెళ్లారు. అదే చెట్టుపై పిడుగు పడడంతో జ్వర అనే (44) మహిళతో పాటు కౌముంద్రి(43)అనే మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

Also Read: రాజమండ్రి కారు ఘటనలో విషాదం.. మెడికో ప్రియాంక కన్నుమూత!

తీవ్రగాయాలతో..

వీరితో మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుయ బరిణి, కుమార్ నీలవతి, కాట సుస్మిత, మద్య దేవక అనే మహిళలకు గాయాలయ్యాయి. ఈ నలుగురిని 108 లో హరిపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు మందస మండలం పాతకోట అనే గిరిజన గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కూటమిలో విభేదాలు సృష్టించేందుకు కుట్ర.. బాలినేని డ్రామా బట్టబయలు చేసిన ఎమ్మెల్యే దామచర్ల!

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×