E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Fatima Sana: డ్రెస్సింగ్ రూంలోనే అలియ కాపురం పెట్టింది..ప‌ట్టించుకునే వాడే లేడు

Fatima Sana: డ్రెస్సింగ్ రూంలోనే అలియ కాపురం పెట్టింది..ప‌ట్టించుకునే వాడే లేడు
Advertisement

Fatima Sana:  టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (2026 Women’s T20 World Cup tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో 22 మ్యాచులు ఫినిష్ అయ్యాయి. ఆస్ట్రేలియా సెమీఫైనల్ కు చేరగా… పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది. వరుసగా మూడు మ్యాచ్ ల‌లో ఓడిపోయిన పాకిస్తాన్, మొన్న ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. అయితే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ మహిళలకు కెప్టెన్ ఫాతిమా సనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ డ్రెస్సింగ్ రూమ్ లో జరుగుతున్న గొడవలను బయటపెట్టారు. డ్రెస్సింగ్ రూంలోనే అలియ రియాజ్ (Aliya Riaz) కాపురం పెట్టింది..ఆమెను ప‌ట్టించుకునే వాడే లేడు అంటూ కెప్టెన్ ఫాతిమా స‌నా ( Fatima Sana) వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, కోచ్ రియాజ్ కు ఫిర్యాదు చేసినా చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, చీమ కుట్టిన‌ట్లుగా కూడా ఎవ‌రూ వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో ఫాతిమా స‌నా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

డ్రెస్సింగ్ రూంలోనే అలియ కాపురం పెట్టింది..ప‌ట్టించుకునే వాడే లేడు

Advertisement

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. అయితే మొన్న ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన తర్వాత, తమ ఓటమిపై పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ ఓటమికి కారణం అలియ రియాజ్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన భర్తతో కలిసి ఇంగ్లాండులో ఎంజాయ్ చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటూ చిల్ అవుతున్నట్లు ఆరోపణలు చేశారు. ప్రాక్టీస్ కు కూడా అలియ రియాజ్ సరిగ్గా హాజరు కావడం లేదని కూడా మండిపడ్డారు.

డ్రెస్సింగ్ రూమ్ లో అస్సలు ఉండడం లేదని సీరియస్ అయ్యారు. ఈ సంఘటనపై కోచ్ వ‌హాబ్ రియాజ్ తో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఎంత చెప్పినా కూడా యాజమాన్యం నుంచి యాక్షన్ తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోయిన తర్వాత, నన్ను అంటే ఏం రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్సింగ్ రూమ్ లో ఇంత జరుగుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు. దీంతో ఫాతిమా సనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా… గడిచిన 5 ఐసీసీ ట్రోఫీలలో పాకిస్తాన్ చెత్త రికార్డు ఉన్న నమోదు చేసుకుంది. మొత్తం 23 మ్యాచ్ లు ఇందులో కేవలం మూడింటిలో మాత్రమే పాకిస్తాన్ విజయం సాధించింది. ఏకంగా 20 మ్యాచ్ లలో ఓడిపోయింది.

Advertisement

 

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

 

Related News

అలియ రియాజ్ జెర్సీ వివాదం…ఐసీసీ డ‌బ్బులు న‌ఖ్వీ మింగేశాడంటూ ట్రోల్స్‌

సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

నా వల్ల కావ‌డం లేదు, ధోనినే పెట్టుకోండి..బీసీసీఐకి తేల్చి చెప్పిన గంభీర్‌ !

Stuart Broad: ఇంగ్లండ్ గ‌డ్డ‌పై స్లెడ్జింగ్ చేసి, వైభ‌వ్ ను రెచ్చ‌గొడ‌తాం !

పాకిస్తాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే, టీమిండియాకు జ‌రిగేలా..అల్లాను ప్రార్థించండి !

Rizwan: ఓడిపోవ‌డం మ‌న‌కు అల‌వాటే, ఆత్మ‌హ‌**త్య‌లు లాంటివి చేసుకోవ‌ద్దు

మొగుడితో రొమాన్స్ చేస్తూ, ఇంగ్లండ్ లో పాక్‌ ప్లేయ‌ర్ షికార్లు..PCBకి ఫిర్యాదు చేసిన స‌నా

Big Stories

×