E-Paper
Advertisement

నెల్లూరు కంచుకోటపై YCP కన్ను.. పోయిన చోటే పట్టు సాధించేలా బిగ్ ప్లాన్!

నెల్లూరు కంచుకోటపై YCP కన్ను.. పోయిన చోటే పట్టు సాధించేలా బిగ్ ప్లాన్!
Advertisement

YSRCP Nellore: ఒకప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులదే విజయం. నేతల దూకుడు, కూటమిపై ఉన్న వ్యతిరేకత, కేడర్ బలం.. ఇలా అన్నీ కలిసి వైసీపీకి ఘన విజయాన్ని అందించాయి. కానీ ఐదేళ్లకే సీన్ రివర్స్ అయి.. 2024 ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికారంతోపాటు పార్టీ బలం పడిపోయింది. కొందరు నేతలు పార్టీని వీడటం, అంతర్గత విభేదాలు అధిష్టానానికి సవాలుగా మారాయి. ఓటమితో వెనక్కి తగ్గని వైసీపీ.. ఇప్పుడు గేరు మార్చింది. కేడర్‌ను యాక్టివ్ చేసి.. నియోజకవర్గాల్లో వరుస మీటింగ్‌లు పెడుతూ ప్రజల్లోకి దూసుకుపోతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్..

Advertisement

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, మత్స్యకారుల సమస్యలు, డీఎస్సీ.. ఇలా ఒక్కోసమస్యపై పోరాడుతూ.. ప్రజలకు కనెక్ట్ అయ్యేలా, ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేసేలా వ్యూహాలు రచిస్తోంది. గ్రామస్థాయి నుంచి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో నేతలను యాక్టివ్ చేయడం, కార్యకర్తలకు అండగా ఉంటూ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది.

పోయిన చోటే పట్టుసాధించాలని వైసీపీ..

Advertisement

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. నెల్లూరు జిల్లా హాట్ పొలిటికల్ జోన్‌గా మారుతోంది. ఓవైపు కూటమి తన పట్టును నిలుపుకోవాలని చూస్తుంటే.. పోయిన చోటే పట్టుసాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మరి వైసీపీ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? కేడర్‌లో పాత జోష్ తిరిగి వస్తుందా? నేతల మధ్య సమన్వయం కుదురుతుందా? ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సాధించగలుగుతుందా? చూడాలి.

Also Read: ఏపీ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో సగం ధరకే ఇంటికి తాజా కూరగాయలు..!

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×