E-Paper
Advertisement

కార్పొరేట్ ఉద్యోగం వదిలి TNR డైరీ ఫామ్.. ప్రకాశం జిల్లా మహేష్ సక్సెస్ స్టోరీ!

కార్పొరేట్ ఉద్యోగం వదిలి TNR డైరీ ఫామ్.. ప్రకాశం జిల్లా మహేష్ సక్సెస్ స్టోరీ!
Advertisement

Pure Milk: చేతిలో హై-ఎడ్యుకేషన్ ఉంది.. చేతినిండా జీతం ఇచ్చే కార్పొరేట్ ఉద్యోగం ఉంది.. కానీ, కల్తీలేని ఆహారాన్ని ప్రజలకు అందించాలనే తపన అతడిని వెనక్కి రప్పించింది. ఇతడే ప్రకాశం జిల్లా కొండేపికి చెందిన మహేష్. ల్యాబ్‌లో ఫుడ్ టెస్టింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన రోజుల్లో.. పాలు, నెయ్యిలో కలుపుతున్న డేంజరస్ కెమికల్స్ చూసి షాకయ్యాడు. ఆ కల్తీ కోరల నుంచి జనాన్ని కాపాడాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

ఇతరులపై ఆధారపడితే కల్తీని ఆపలేం..

Advertisement

మొదట్లో చుట్టుపక్కల రైతుల దగ్గర పాలు సేకరించి సేల్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ, అక్కడా కొందరు నీళ్లతో పాటు కేటిల్ కెమికల్స్, డిటర్జెంట్లు కలుపుతున్నట్టు కనిపెట్టాడు. ఇతరులపై ఆధారపడితే ఈ కల్తీని ఆపలేమని అర్థం చేసుకున్న మహేష్.. దారినే మార్చేశాడు. కల్తీకి ‘నో’ చెప్తూ.. సొంతంగా TNR ఫార్మ్స్‌ పేరుతో మోడరన్ డైరీ ఫామ్ స్టార్ట్ చేశాడు.

24 గంటలు నరకమే..

Advertisement

పశువుల మేత దగ్గర్నుంచి పాలు పితికే వరకు ప్రతి ఒక్కటి మహేష్ దగ్గరుండి చూసుకుంటాడు. డైరీ మెయింటెనెన్స్ అంటే 24 గంటల నరకమే.. కానీ లాభాల కంటే జనం ఆరోగ్యమే ఇంపార్టెంట్ అంటున్నాడు. జాబ్ వదిలేసినా.. ఇప్పుడు హెల్దీ ఫుడ్ ఇస్తూ, నెలకు మంచి ఇన్ కమ్ సాధిస్తూ తోటి నిరుద్యోగులకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు.

తెల్లగా ఉన్న ప్రతీది పాలు కాదు..

తెల్లగా ఉన్న ప్రతీది పాలు కాదు.. కానీ మహేష్ ఇచ్చే పాలు మాత్రం 100శాతం నమ్మకానికి మారుపేరు అనే పేరుంది. సొంత ఊరిపై మమకారంతో, సమాజంపై బాధ్యతతో అడుగులేస్తున్న మహేష్ లాంటి యువ రైతులకు ప్రభుత్వం, బ్యాంకులు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: పొలం మట్టికి కేసులు.. మాఫియాకు గ్రీన్ సిగ్నల్? ఏమిటీ ద్వంద్వ నీతి!

Tags

Related News

1984లో స్టార్ట్ చేశారు.. కానీ ఇప్పటికీ ఆ కాలేజీకి భవనం లేదు! ఎక్కడో తెలుసా?

కాకినాడలో భారీ వర్షాలు.. అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

బాబు వెన్నుపోట్లను గడపగడపకూ తీసుకెళ్లండి.. జగన్ హాట్ కామెంట్స్!

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

Big Stories

Advertisement
×