Pulasa Fish: నాన్‌వెజ్ ప్రియలు అమితంగా ఇష్టపడే వాటిలో చేపలు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో రకరకాల చేపలకు మాంచి డిమాండ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పులస చేపలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. పుస్తెలు అమ్మి ఐనా సరే పులస తినాలని భావించిన సందర్భాలు అప్పట్లో ఉండేవి. వర్షాకాలం మొదలై దాదాపు రెండున్నర నెలలు గడిచిపోయింది. సరైన పులస చేపలు దొరకడం లేదన్నారు గోదారి ప్రజలు. అసలు కారణమేంటి?
ఎర్ర నీరు చేరిందంటే చాలు గోదావరి నదిలో పులస చేప సందడి మొదలైనట్టే. ఈ పులస చేపకు విపరీతమైన క్రేజ్. దీన్ని తినాలనే కోరికతో వేలకు వేలు పెట్టి కొనుగోలు చేస్తుంటారు నాన్‌వెజ్ ప్రియులు. సీజన్‌లో ఒక్కసారైనా ఆ చేప రుచి చూడాలని భావిస్తుంటారు. ముఖ్యంగా తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుంటాయి. అందులో ధవళేశ్వరం, సిద్ధాంతం, నర్సాపురం తీర ప్రాంతాల్లో జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పులస చేపలు ఎక్కువగా దొరుకుతుంటాయి.
ఎల్‌ని నో ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈసారి పెద్దగా వర్షాలు పడలేదు. ఏదో ఒక రోజు భారీ వర్షం పడితే.. మూడు రోజులు వాతావరణం డల్‌గా ఉంటుంది. నాలుగైదు రోజులు భారీగా వర్షం పడిన సందర్భం లేదు. ఆ తర్వాత మళ్లీ ఎండలు దంచుతున్నాయి. ఈసారి గోదావరి తీరంలో పులస చేప దొరకడం కష్టంగా ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. పెద్దగా వర్షాలు లేకపోవడంతో దీనికి కారణమని అంటున్నారు. గతంలో ఉదయం-సాయంత్రం పులస లభించేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. రెండు లేదా మూడు రోజులకు ఒకసారి పులస చేప లభిస్తుందని చెబుతున్నారు. కేవలం నదిల్లోకి కొత్త నీరు రాలేకపోవడం మరొక కారణంగా చెబుతున్నారు.
పులస చేప వర్షాకాలంలో గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ చేపలో ఉండే ప్రొటీన్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతుంటారు. నార్మల్‌గా చేప అనేది ఆరోగ్యానికి మంచింది. కాకపోతే ఇందులో విలువైన పోషకాలు ఉంటాయి. అందుకే అంత రేటు పెట్టి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాటిని తినాలని ఆరాటపడుతుంటారు నాన్‌వెజ్ ప్రియులు. ఏడాదిలో కనీసం కిలో చేప తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుందని నిపుణుల మాట. జులై నుంచి సెప్టెంబర్ మాసాల్లో పులస లభిస్తుంది. అల్రెడీ జూన్ నుంచి లెక్కిస్తే.. రెండున్నర నెలలు గడిచిపోయింది. కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికైనా నాలుగైదు రోజులు భారీ వర్షం పడే పులస యాక్టివ్ కావచ్చని మత్స్యకారులు చెబుతున్నారు.
గత సీజన్లలో పులస చేప రూ.15 వేల నుంచి రూ.20 వేలకుపైగా విక్రయించిన సందర్భాలు ఉన్నాయి. గతేడాది యానం మార్కెట్‌లో 2 కిలోల పులస రూ.26 వేల ధర పలికింది. పులస చేప వెనుక ఓ మాయాజాలం నడుస్తోందని ఆరోపణలు లేకపోలేదు. పులస చేప తినాలనే కోరికను కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారట, ఒడిశా ప్రాంతంలో దొరికే హిల్సా చేపలను ఇక్కడికి తీసుకొచ్చి లస చేపలుగా విక్రయిస్తున్నారట. చేప సముద్రంలో ఉంటే ఇలస.. గోదావరిలోకి వస్తే పులసగా మారుతుందని జాలర్లు వాదిస్తున్నారు. మొత్తానికి పులస చేపపై వ్యాపారులు ఒకలా.. జాలర్లు మరోలా చెబుతున్నారు. పులస చేప మార్కెట్లో ఇప్పుడో కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.
ALSO READ: అమెరికా ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు టెక్కీ మృతి, షాక్‌లో కుటుంబసభ్యులు