Thalliki Vandanam Scheme: చంద్రబాబు సర్కార్ అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కొత్త రికార్డులు నమోదవుతున్నాయా? ఏడాదిగా పథకాలు అమలు చేయలేదంటూ వైసీపీ రీసౌండ్‌కు కూటమి సర్కార్ రిప్లై ఇచ్చిందా? విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందాలు మిన్నంటాయా? రాబోయే ఐదేళ్లు ఇదే దూకుడు కొనసాగితే ఏపీలో జనాభా పెరగడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
సీఎం చంద్రబాబు ఏది చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తారని చాలా మంది నేతలు, అధికారులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. లోతుల్లోకి వెళ్తేనే కానీ దాని అర్థం తెలీదు. అందుకే ఎగ్జాంఫుల్ ఇటీవల ఏపీలో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం. ఫ్యామిలీలో ఎంతమంది పిల్లలు ఉంటే వారికి 15 వేల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
అన్నట్లుగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. సాంకేతిక సమస్యల వల్ల తలుల ఖాతాలోని నిధులు ఆలస్యంగా జమ అవుతున్నాయి. వాటిని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. పాఠశాల అభివృద్ధికి రెండేసి వేలు కట్ చేసి 13 వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే వారికి తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి.
ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని కలకడ గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబంలో ముగ్గురు తల్లులకు 12 మంది పిల్లలు ఉన్నారు. వారికి డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి రూ. 1.56 లక్షలు తమ అకౌంట్‌లో పడటంతో ఆ కుటుంబం సంతోషం అంతా ఇంతా కాదు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కలా.. నిజమా అంటూ కుటుంబసభ్యులే నమ్మలేక పోతున్నారు.
ALSO READ: సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్.. సమయం లేదు మిత్రమా?
వైసీపీ ప్రభుత్వంలో ఫ్యామిలీకి ఒకరికి మాత్రమే నిధులు ఇచ్చేవారని, కూటమి సర్కార్ ఎంతమంది పిల్లలు పాఠశాలలో చదువుతుంటే అందరికీ ఇస్తున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ఆ కుటుంబసభ్యులు మరిచిపోలేక పోతున్నారు. ఈ ఒక్క ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఉన్న తల్లులు సైతం ఇదే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎడ్యుకేషన్ వ్యవస్థని బలోపేతం చేస్తోంది కూటమి సర్కార్. కింది స్థాయి నుంచి పైస్థాయిలో క్రమంలో సంస్కరణలు తీసుకొస్తోంది. దీనికితోడు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మరింత భరోసా వచ్చినట్లయ్యింది.
‘పిల్లలను కనండి.. తాము భరోసా’ అంటూ పదేపదే చెబుతున్నారు సీఎం చంద్రబాబు. పిల్లల తల్లులకు ఇలాంటి సాయం, సరైన ఎడ్యుకేషన్‌తోపాటు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనకు ప్రజలు రీచ్ కావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు పడిన తల్లికి వందనం.
అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయి. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్ లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవు.… pic.twitter.com/2FG6doYBsQ
— Telugu Desam Party (@JaiTDP) June 14, 2025