E-Paper
Advertisement

జనసేన లేకపోతే కూటమికి ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు: బొత్స సత్యనారాయణ

జనసేన లేకపోతే కూటమికి ఆ ఓట్లు కూడా వచ్చేవి కావు: బొత్స సత్యనారాయణ
Advertisement

Botsa Satyanarayana: 2029 ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీ తిరిగి విజయం సాధిస్తుందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం విజయనగరం జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఓటమి తర్వాత కూడా పార్టీ శ్రేణుల్లో మళ్లీ గెలిచినంత ఉత్సాహం కనిపిస్తోందని, కూటమితో తాడోపేడో తేల్చుకునేందుకు జిల్లా కేడర్ సిద్ధంగా ఉందని బొత్స పేర్కొన్నారు.

6 వేల ఓట్ల తేడాతోనే కూటమి గట్టెక్కింది

Advertisement

గత ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసని బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లా మొత్తం మీద చూసుకుంటే కూటమికి, వైసీపీకి మధ్య కేవలం 6 వేల ఓట్ల మెజారిటీ మాత్రమే ఉందని ఆయన విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో జనసేన తోడు లేకపోయి ఉంటే విజయనగరంలో వైసీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేసి ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి నేతలకు వారిపై వారికే నమ్మకం లేదని విమర్శించిన బొత్స, బీసీల పేరు చెప్పి ఓసీలను తీసుకువచ్చి పోటీ చేయించడం కూటమి నేతల తీరుకు నిదర్శనమని ఆరోపించారు.

శాంతిభద్రతలు, సీఐఐ సదస్సుపై విమర్శలు

Advertisement

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని బొత్స ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో హత్యలు, మానభంగాలతో పాటు గంజాయి కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) సదస్సు తీరును ఆయన తప్పుబట్టారు. సదస్సు ప్రధాన వేదికపై ప్రపంచ దేశాల నేతలు ఎవరూ కనిపించలేదని, కేవలం టీడీపీ మంత్రులు మాత్రమే కూర్చున్నారని విమర్శించారు.

కార్యకర్తలకు భరోసా.. నేతలకు హెచ్చరిక

అధికారం ఉన్నప్పుడు ఎవరైనా వెంట ఉంటారని, కానీ అధికారం లేనప్పుడు కూడా పార్టీతో నడిచేవారే నిజమైన నాయకులు, కార్యకర్తలని బొత్స అన్నారు. వైసీపీ కార్యకర్తల మీద ఈగ వాలితే చూస్తూ కూర్చోవడానికి తాము కూటమి నాయకులమని కాదని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టే అవతలి పార్టీ నేతలకు తప్పకుండా చుక్కలు లెక్కపెట్టే రోజు వస్తుందని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Also Read: గడ్చిరోలి గడ్డపై ఆదివాసీ కళా వైభవ జాతర.. ఉత్సవానికి సర్వం సిద్ధం!

Tags

Related News

తెలంగాణకు థ్యాంక్స్ చెప్పిన ఏపీ.. ఇక్కడి అధికారులపై ప్రశంసలు.. ఎందుకంటే?

ఏపీలో మళ్లీ మోగిన ఎన్నికల నగారా.. నేడు పెండింగ్ పురపాలికలు.. రేపు తొలి దశ పంచాయతీలకు నామినేషన్లు!

ఇచ్చాపురంలో వైసీపీ ఘోర పరాజయం.. ఓటమికి అసలు కారణం అదేనా..?

విశాఖ సీఐఐ సదస్సులో ఏపీకి రూ.5.84 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఏపీకి సినీ పరిశ్రమ.. మంత్రి లోకేశ్ మాస్టర్ ప్లాన్.. వైజాగ్‌కు ‘భల్లాలదేవుడి’ కీలక భరోసా!

12 ఏళ్ల తర్వాత రాజమండ్రి నగర పోరు.. కూటమి జోరుకు వైసీపీ చెక్ పెడుతుందా?

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ ఏపీకి ఉండటం అదృష్టం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

Big Stories

Advertisement
×