Tirumala Darshan Tickets: వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనాలు, గదుల కోటా వివరాలను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన ఫిబ్రవరి(2026) నెల కోటాను నవంబర్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
సేవల టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం నవంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు నవంబర్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేస్తారు.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవం టికెట్లను నవంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను నవంబర్ 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను నవంబర్ 24న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను నవంబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను నవంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెంబర్ https://ttdevasthanams.ap.gov.in ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
Also Read: PM Kisan Annadata Sukhibhava: రైతుల ఖాతాల్లో రూ.7000, అన్నదాత సుఖీభవ డబ్బులు పడేది అప్పుడే?