BigTV English

Tirumala News: తిరుమల మహాద్వారం.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ఏం జరిగింది?

Tirumala News: తిరుమల మహాద్వారం.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, ఏం జరిగింది?

Tirumala News: గోవింద గోవింద నామస్మరణతో తిరుమల గిరులు పులకించుపోతాయి. తిరుపతికి వరకు ఒకలా ఉన్నా.. తిరుమలలో అడుగుపెట్టేసరికి ఆనందం, ఉత్సాహం రెండూ వచ్చేస్తాయి సగటు భక్తులకు. ఉన్న బాధలన్నీ మరిచిపోతారు భక్తులు.  రోజు రోజుకూ అక్కడ భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది.


సాధారణ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది సమ్మర్ సీజన్ గురించి చెప్పనక్కర్లేదు. ఇసుక వేస్తే రాలనంత భక్తులు తిరుమల గిరుల్లో కనిపిస్తారు. వచ్చినవాళ్లు వస్తారు.. దర్శనం తర్వాత ఇంటికి వెళ్లేవాళ్లు అలాగే ఉంటారు. ఒక్కసారి దర్శించు కుంటే మనిషి, మనసుకు ఉపశమనం దక్కుతుందని భావిస్తారు.. ఆరాటపడతారు. అందుకోసమే ఇబ్బందులు పడుతూ శ్రీనివాసుడ్ని దర్శించుకునేందుకు పోటీ పడతారు.

అసలే సమ్మర్, ఆపై పిడిగుద్దులు


అసలే సమ్మర్ సీజన్.. అక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఫ్యామిలీలతో సహా శ్రీవారిని దర్శించుకుంటారు.  రద్దీ నేపథ్యమో ఏమోగానీ క్యూలైన్‌లో భక్తుల మధ్య చిన్నపాటి గొడవ చెలరేగింది. మాటల యుద్దం కాస్త శృతి మించింది.  మహా ద్వారం దగ్గరకు వచ్చేసరికి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు భక్తులు.

మహా ద్వారం టీటీడీ సిబ్బంది ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే.. వచ్చి వెళ్లేవారికి అదే రూటు కావడంతో నిత్యం సిబ్బంది అక్కడ ఉంటారు. టీటీడీ భద్రతా సిబ్బంది వచ్చి సర్ది చెప్పినా ఇరువర్గాల భక్తులు వెనక్కి తగ్గలేదు. ఆపై ముష్టిగాతాలకు దిగారు. దీంతో అక్కడ కాస్త అలజడి చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం తర్వాత రెండు గ్రూపులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు.

ALSO READ: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, మరో నాలుగు రోజులు అక్కడ ఇదే పరిస్థితి

తిరుమల రద్దీ స్టేటస్

ఇక సర్వదర్శనం టోకెట్ల విషయానికొద్దాం. శ్రీవారి మెట్టు ద్వారా వచ్చే భక్తులకు 2242 టోకెట్లు ఇవ్వాలని నిర్ణయించింది టీటీడీ. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ప్రతీ గంటలకు దివ్వదర్శనం టోకెన్లను జారీ చేసింది. మధ్యాహ్నం రెండు గంటలకు-242, మూడు, నాలుగు గంటలకు 500 చొప్పున టొకెన్లు ఇవ్వనున్నారు. ఐదుగంటలకు 1000 వరకు టోకెన్లు ఇష్యూ చేయనున్నారు.

తిరుమలలో రూముల విషయానికొద్దాం. రూ. 50 రూములు 243 ఖాళీ ఉన్నాయి. అదే రూ. 100 లకు సంబంధించి 1065 వరకు ఖాళీ ఉన్నాయి. ఇక రూ.1000, 1518 వాటికి సంబంధించి గదులు ఫుల్ అయిపోయాయి. గదుల విషయానికి సంబంధించి ఆదివారం ఉదయం ఆరుగంటలకు సంబంధించిన విషయం మాత్రమే. దయచేసి భక్తులు ఈ విషయాన్ని పరిశీలించగలరు.  వీకెండ్ కావడంతో భక్తులు అధికంగా వచ్చినట్టు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×