Fish Harmful During Pregnancy| ఒక మహిళ గర్భవతి అయిన సమయంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఆహార ప్రభావం ఆమెపై మాత్రమే కాదు ఆమె కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై కూడా ఉంటుంది. అందుకే అలాంటి సమయంలో అన్ని విషయాల్లో కాస్త ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవాలి. కానీ ప్రొటీన్ అందించే ఆహార పదార్థాల్లో చేపలు కూడా ఒకటి. అయితే చేపలు గర్భవతుల ఆరోగ్యానికి మంచివి కావు అని నిపుణలు సూచిస్తున్నారు. సాధారణంగా చేప ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ డి, ప్రొటీన్ కూడా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. చేపలు తినడం వల్ల మన ఆరోగ్యానికి ఇవి అందుతాయి. కానీ గర్భం ధరించిన మహిళ విషయం అందుకు భిన్నం.
మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు వారి శరీరంలో సెన్సిటివిటీ పెరిగిపోతుంది. జీర్ణశక్తి తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తిలో కూడా మార్పులు వస్తాయి. అందుకే ఇలాంటి సమయంలో శరీరాన్ని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచే ఆహారం మాత్రమే తినాలి. చాలా మంది న్యూట్రిషనిస్టులు (పోషకాహార నిపుణలు) గర్భవతి అయిన మహిళ చేపలు తినడం ఆరోగ్యకరం కాదని అభిప్రాయపడుతున్నారు. చేపలు ఆ సమయంలో తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఒకసారి చూద్దాం.
1.మెర్కురీ టాక్సిటీ
చేపల్లో ఉండే మెర్కురీ అనే న్యూరో టాక్సిన్ (మలినం) గర్భంలో పెరిగే బిడ్డ మెదడు ఎదుగుదలకు హాని కలిగించే అవకాశం ఉంది. మిడ్‌వైఫెరీ అండ్ వుమెన్స్ హెల్త్ అనే సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భవతులు చేపలు తినడం వల్ల వారికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అవి కడుపులో పెరిగే బిడ్డకు మంచిదే. కానీ చేప తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద సైజు చేపలు, ఎక్కువ కాలం జీవించిన చేపల్లో మెర్కురీ మలినాలు (న్యూరో టాక్సిన్స్) ఉంటాయి. వీటిని తినడం వల్ల గర్భంలోని బిడ్డ నాడి సిస్టమ్, మెదడు ఎదుగుదలపై ప్రభావంపై ఉంటుంది.
2.ఇన్‌ఫెక్షన్ ప్రమాదం
చేపలు సరిగా ఉడకని లేదా పచ్చిగా ఉండే చేపలు తినడం వల్ల అందులోని బ్యాక్టీరియా, హాని కలిగించే లిస్టీరియా గర్భవతి మహిళలకు, వారి కడుపులో ఉండే పిండానికి హానికరం. చైనా, జపాన్, కొరియా వంటకాలైన సూషి, స్మోక్ డ్ ఫిష్ లో చేపలు పూర్తిగా వండరు. అందుకే వాటిలో లిస్టీరియా, టాక్సో ప్లాస్మా అనే బ్యాక్టీరియా, ప్యారసైట్స్ ఉంటాయి. వీటి వల్ల ఎరిత్రోపోయిటిన్ అనే ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం.. తద్వారా గర్భస్రావం, సమయానికి ముందే కాన్పు కావడం, లేదా కడుపులోనే బిడ్డ చనిపోవడం లాంటివి జరగవచ్చు. అందుకే చేపలు తింటే పూర్తిగా వండిన చేపలు, పైగా చిన్న సైజు చేపలు తినాలి. అవి కూడా తక్కువ మోతాదులోనే తినాలి.
Also Read: చెరకు రసం vs కొబ్బరి నీళ్లు.. వేసవిలో ఏది బెస్ట్
3.ఆహారం జీర్ణంకాక అసౌకర్యం
గర్భం దాల్చిన సమయంలో మహిళ ఆరోగ్యం అంటే జీర్ణక్రియ వేగంగా ఉండదు. అలాంటి సమయంలో ఎక్కువ మోతాదులో చేపలు తినడం వల్ల జీర్ణం సరిగా జరగక అజీర్తి, యాసిడిటీ, వాంతులు కలగడం లేదా కడుపులో నొప్పిగా ఉండడం జరుగుతుంది. దీని వల్ల శరీరంలో నీటి శాతం, పోషకాలు తగ్గిపోతాయి. ఇది తల్లి, బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు.
4.బలహీనమైన రోగనిరోధక శక్తి
ఏదైనా తక్కువ నాణ్యత ఉన్న చేపలు తినడం వల్ల.. అందులోని బ్యాక్టీరియా లేదా టాక్సిన్స్ శరీరంపై తప్పకుండా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చేపలోని కెమికల్స్, మెర్కురీ న్యూరో టాక్సిన్స్ మానవ శరీరంలోని రోగ నిరోధక సెల్స్ పై దాడి చేస్తాయి. దీని వల్ల అనారోగ్యం చేసి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదముంది. గర్భవతుల రోగనిరోధక శక్తి బలహీన మైతే చాలా ప్రమాదం.
5.ఆహారం వల్ల రోగాలు వ్యాప్తి
గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలకు ఫుడ్ ఇన్‌ఫెక్షన్ ఈజీగా సోకుతుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, లిస్టీరియా, ఇ కోల్లీ లాంటి ప్రమాదకర బ్యాక్టీరియా ఎక్కువ కాలం నిల్వఉన్న చేపలు అంటే ఫ్రిజ్ లో నిల్వ చేసే చేపల్లో ఉంటుంది. వీటిని తినడం లేదా వీటిలో సూషి, స్మోక్ డ్ ఫిష్ లాంటి సరిగా ఉడకని వంటలు చేయడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి.. వాంతులు, విరేచనాలు, జ్వరం, శరీరంలో నీరు తగ్గిపోవడం వంటి అనారోగ్యం సమస్యలు వస్తాయి. ఇవి గర్భవతులకు, వారి కడుపులో బిడ్డకు ప్రాణాంతకం.
చేప తినడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా లాభాలు కూడా ఉన్నాయి. కానీ తక్కువ క్వాలిటీ చేపలు, లేదా ఆరోగ్యానికి హాని కలిగించే చేపలు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చేపతో పాటు అధిక మొత్తంలో మాంసాహారం కూడా తినకూడదు.
గమనిక: ఇది సాధారణ సమాచారం. మరిన్ని వివరాలు లేదా ధృవీకరణ కోసం వైద్యులు, పోషకాహార నిపుణులను సంప్రదించగలరు.