PM Vishwakarma Yojana: మన దేశంలో అనేక రకాల పథకాలు అమలులో ఉన్నాయి. అదే సమయంలో.. అవసరాన్ని బట్టి అనేక కొత్త పథకాలు కూడా కాలానుగుణంగా ప్రారంభిస్తారు. అంతే కాకుండా.. వాటిని మెరుగుపరచడానికి అనేక పాత పథకాలలో కూడా మార్పులు చేస్తుంటారు. సెప్టెంబర్ 2023లో.. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకం వల్ల చాలా మంది లబ్ది పొందుతున్నారు. మీరు కూడా ఈ పథకంలో చేరితే.. రోజుకు రూ. 500 పొందవచ్చు. కాబట్టి.. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎలాంటి అర్హతను ఉండాలి ? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం విశ్వకర్మ యోజన:
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద.. లబ్ధిదారులకు రూ. 500 మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉంది. లబ్ధిదారులకు కొన్ని రోజులు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కొనసాగుతున్నంత కాలం.. రోజుకు రూ. 500 స్టైఫండ్‌గా ఇస్తారు. ఇందులో ప్రోత్సాహకాలకు కూడా నిబంధన ఉంటుంది.
ఎవరు అర్హులు ?
మీరు ఈ పథకంలో చేరితే.. తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించే అవకాశం కూడా ఉంటుంది. మొదట రూ.లక్ష లోన్ ఇస్తారు. న ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చిన తర్వాత.. మళ్ళీ రూ. 2 లక్షల రుణం పొందవచ్చు.
18 రకాల చేతి వృత్తులకు మాత్రమే ఈ పథకంలో వర్తిస్తుంది.
చాకలి
స్టోన్ బ్రేకర్స్
దర్జీలు, తాళాలు తయారు చేసేవారు
ఫిషింగ్ నెట్ తయారీదారులు
సుత్తి, టూల్‌కిట్ తయారీ దారులు
తాపీ మేసన్లు, పడవ నిర్మాణ దారులు
కమ్మరి, స్వర్ణకారులు
బుట్ట/మత్/చీపురు తయారీ దారులు
రాతి చెక్కేవారు
చెప్పులు కుట్టేవారు/షూ మేకర్లు
మంగలి
దండలు తయారు చేసేవాడు
బొమ్మల తయారీదారులు
శిల్పి
మరిన్ని విషయాలు:
పీఎం విశ్వకర్మ యోజనలో చేరిన కళాకారులు PM విశ్వకర్మ సర్టిఫికేట్ , ID కార్డు పొందుతారు. ఇది వారి నైపుణ్యాలను గుర్తిస్తుంది.
నైపుణ్య అభివృద్ధి శిక్షణ:
5-7 రోజులు లేదా అవసరమైన వారికి 15 రోజులు టైనింగ్ అందిస్తారు. శిక్షణా సమయంలో రోజుకు ₹500 స్టైపెండ్ అందించబడుతుంది .
టూల్‌కిట్ ప్రోత్సాహం:
ప్రాథమిక శిక్షణ ప్రారంభంలో ₹15,000 వరకు టూల్‌కిట్ కొనుగోలు కోసం e-voucher ఇస్తారు .
డిజిటల్ లావాదేవీలకు ప్రోత్సాహం:
ప్రతి డిజిటల్ లావాదేవీకి ₹1 వరకు, నెలకు గరిష్టంగా 100 లావాదేవీలకు, ప్రోత్సాహకంగా అందించబడుతుంది .
మార్కెటింగ్ :
ఉత్పత్తులకు సర్టిఫికేషన్, బ్రాండింగ్, e-commerce ప్లాట్ ఫారమ్‌లపై ఉత్పత్తుల లిస్ట్ చేయడం, ప్రదర్శన, ప్రచారం వంటి మార్కెటింగ్ మద్దతు అధికారులు అందిస్తారు.
లబ్ధిదారులు అధికారిక MSME వ్యవస్థలో భాగస్వాములుగా గుర్తింప బడతారు. ఇది వారి వ్యాపార అభివృద్ధికి కూడా సహాయపడుతుంది .
Also Read: మన దేశంలోనే మినీ స్విట్జర్లాండ్, కట్టిపడేసే ప్రకృతి అందాలు
దరఖాస్తు విధానం:
లబ్ధిదారులు గ్రామ సేవా కేంద్రాలు లేదా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల ద్వారా ఈ పథకంలో చేరవచ్చు.
మరింత సమాచారం కోసం:
ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజనకు సంబంధించిన పూర్తి వివరాలు , దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://pmvishwakarmayojna.com.
pmvishwakarmayojna.com