BigTV English

Tobacco in Laddu : మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..

Tobacco in Laddu : మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..

Tobacco in Laddu : తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం రగడ ఇంకా చల్లారకముందే.. భద్రాచలంలో మరోసారి టీటీడీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఖమ్మంకు చెందిన భక్తులు తిరుమలకు వెళ్లి ఇటీవలే సొంతూరికి చేరుకున్నారు. స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారన్న వార్తలు రావడంతో.. వారు లడ్డూని ముక్కలు చేసి చూడగా.. అవాక్కయ్యే విషయం తెలిసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఏకంగా పొగాకు పొట్లం కనిపించింది.


ఖమ్మంకు చెందిన పద్మావతి అనే మహిళ, కుటుంబ సభ్యులు ఈ నెల 19న తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఇంటికి వెళ్లాక ఇరుగు, పొరుగు వారికి, ఇంట్లోని వారికి ప్రసాదం పంచే క్రమంలో.. లడ్డూ ప్రసాదంలో పొగాకుతో ఉన్న పొట్లం కనిపించింది. దానిని చూసిన కుటుంబ సభ్యులంతా ఖంగుతిన్నారు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో పొగాకు రావడంతో.. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లడ్డూలో కనిపించిన పొగాకును ఎవరో నమిలి, పేపర్లో చుట్టి లడ్డూలో పెట్టి చుట్టారని, ఇది చాలా దారుణమని వాపోయిందామె. ఇప్పటివరకూ 8 సార్లు తిరుమలకు వెళ్లామని, ఎప్పుడూ ఇలాంటి చేదు అనుభవం కలుగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Also Read: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు.. కల్తీ నెయ్యిపై టీటీడీ క్లారిటీ


తిరుమల లడ్డూల తయారీలో కల్తీ జరుగుతుందని వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే కుంపటి రగులుతోంది. దానిపై సిట్ కూడా ఏర్పాటు చేశారు. అంతలోనే అదే తిరుమల లడ్డూలో పొగాకు ఉందన్న విషయం బయటికి రావడంతో.. మరో సంచలనానికి దారి తీసింది. స్వామివారి ప్రసాదం తయారు చేసేవారంతా చాలా నిష్టగా ఉంటారు. కొండపై ధూమపానం, మద్యపానం నిషేధం. ఆలయంలోకి ప్రవేశించేవారి వద్ద అలాంటివి ఏవి ఉన్నా వారికి ప్రవేశం ఉండదు. స్వామివారికి సంబంధించిన సేవలు చేసేవారికి ఈ నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయి. అలాంటిది.. స్వామివారి లడ్డూలో నమిలిన పొగాకును చుట్టి ఉంచడం కలకలం రేపుతోంది. ఇలాంటివి చూస్తుంటే స్వామివారి ప్రసాదం తినాలంటేనే భయమేస్తోందని వాపోతున్నారు. దీనికి కారకులెవరో టీటీడీ, ఏపీ ప్రభుత్వం తేల్చాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×