BigTV English

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…

KTR Tweet: బండి సంజయ్‌పై కేటీఆర్ ట్వీట్.. ఈ చిల్లర మాటలు దేనికంటూ…

KTR Latest Tweet againist Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ పై మాజీమంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిల్లర మాటలు దేనికి? అంటూ ఫైరయ్యారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఈ విధంగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘గౌరవనీయులైన బండి సంజయ్ గారు! దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది ఈ వ్యవహారం. మీరు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మర్చిపోయినట్లు ఉన్నారు. అమృత్ పథకం మీ కేంద్ర పథకమే. అందులో అవినీతి జరిగిందని ముందుగా చెప్పిందే స్వయాన మీ పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా కన్వీనియంట్ గా కళ్లు మూసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం ఆధారాలతో మేం బయట పెట్టాక ఈ చిల్లర మాటలు దేనికి? సీవీసీ స్వతంత్ర సంస్థ… దానికి మీ సిఫార్సు దేనికి? అయినా మీ అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ అందూ గమనిస్తూనే ఉన్నారు!’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.


Also Read: కాళేశ్వరం ఇంజినీర్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సీరియస్

ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి అమృత్ పథకం టెండర్ల విషయమై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ పథకం టెండర్లలో అక్రమాలు జరిగాయంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఎలా కేటాయించారంటూ ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. ఆ వెంటనే మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. కేటీఆర్ ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలుంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలను నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ మంత్రి పొంగులేటి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.


Also Read: బావబామ్మర్దులు వారి బొందను వాళ్లే తొవ్వుకుంటున్నారు: మైనంపల్లి

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×