BigTV English

TTD: తిరుమలలో భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..

TTD: తిరుమలలో భక్తుల రద్దీ వేళ టీటీడీ కీలక నిర్ణయం.. మే 1 నుంచి అమలు..

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల కోసం దృష్టిలో ఉంచుకుని.. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. ఈ కొత్త విధానం మే 1 నుంచి ప్రయోగాత్మకంగా అమలులోకి రానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.


టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నూతన షెడ్యూల్ ప్రకారం, మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను మార్నింగ్ 6 గంటల నుంచి ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న సమయాన్ని ముందుకు జరపడంతో.. తర్వాతి స్లాట్లలో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కల్పించవచ్చని టీటీడీ భావిస్తోంది.

ఇదే కాకుండా.. వేసవి సెలవుల కాలంలో (మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు) వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో ఇంకొన్ని మార్పులు చేశారు. ఈ నిర్దిష్ట సమయంలో.. కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలు స్వయంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రమే వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు తెలిపారు. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారికి ఈ కాలంలో బ్రేక్ దర్శన సౌకర్యం అందుబాటులో ఉండదని టీటీడీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఎండాకాలంలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే.. ఈ నిర్ణయాల ముఖ్య ఉద్దేశ్యమని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.


ఈ మార్పులను ముందుగా పరిశీలనాత్మకంగా అమలు చేసి, భక్తుల స్పందన, క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన అనంతరం తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సామాన్య భక్తుల దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలను పలువురు స్వాగతిస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×