BigTV English

OTT Movie : కొరియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ క్లైమాక్స్ ఉన్న మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే ?

OTT Movie : కొరియన్ సినిమా చరిత్రలోనే బెస్ట్ క్లైమాక్స్ ఉన్న మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే ?

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు సినిమాలంటే ఇష్టపడని వారు ఉండరు. ఇలాంటి సినిమాల కోసమే వెతుకుతున్నారా? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ కొరియన్ బెస్ట్ టాప్ 10 సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ చివరి వరకు ఆసక్తికరంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ కొరియన్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఓల్డ్ బాయ్’ (Oldboy). ఈ సినిమాకి పార్క్ చాన్-వుక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ‘జపనీస్ మాంగా’ సిరీస్ ఆధారంగా రూపొందించారు. పార్ చాన్-వుక్ దర్శకత్వం వహించిన వెంజెంస్ ట్రయాలజీలో ఈ మూవీ రెండవది. మొదటి మూవీ సింపతి ఫర్ మిస్టర్ వెంజెంస్. చివరి చిత్రం సింపతి ఫర్ లేడి వెన్ జెంస్. దీని స్టోరీ ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగే భయంకరమైన, ఊహించని మలుపుల చుట్టూ తిరుగుతుంది.ఈ మూవీ కేన్స్ చలన చిత్ర ఉత్సవంలో గ్రాండ్ ప్రిక్స్ అవార్డును సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత సినీ విమర్శకుడు రోజర్ ఎబెర్ట్, ఈ సినిమా గురించి వ్రాస్తూ ‘Oldboy is a ‘powerful film not because of what it depicts, but because of the depths of the human heart which it strips bare’ అంటూ ప్రశంసించారు. ఈ సినిమా ఆసియాకు చెందిన బెస్ట్ టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

ఓ దా అనే సాధారణ వ్యక్తి ఒక చిన్న వ్యాపారవేత్త. . ఒక రోజు తాగిన మత్తులో ఉండగా, ఎవరో అతన్ని కిడ్నాప్ చేసి, ఒక చిన్న గదిలో బంధిస్తారు. బయటికి పోయే దారే ఉండదు. అక్కడ అతన్ని ఒకటి కాదు, రెండు కాదు.. 15 సంవత్సరాల పాటు బంధిస్తారు. ఎందుకు బంధించారు? ఎవరు చేశారో కూడా తెలియకుండా గడుపుతాడు. ఈ గదిలో అతనికి టీవీ ద్వారా మాత్రమే బయటి ప్రపంచ వార్తలు తెలుస్తాయి. ఆ వార్తల్లో తన భార్య హత్యకు అతనే నిందితుడని తెలుస్తుంది. ఇక ఈ 15 ఏళ్లలో అతను తనను బంధించిన వ్యక్తిని కనిపెట్టి, ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఒక రోజు ఓ దా అనూహ్యంగా విడుదలవుతాడు. అతనికి తనను బంధించిన వ్యక్తిని కనిపెట్టడానికి కేవలం 5 రోజుల సమయం ఉంటుంది.

ఈ క్రమంలో అతను మి-డో అనే యువతిని కలుస్తాడు. ఆమె అతనికి సహాయం చేస్తుంది. ఓ దా తన శత్రువు ఒక ధనవంతుడైన లీ వూ-జిన్‌ను అని కనిపెడతాడు. ఇక్కడ నుండి కథలో ఊహించని మలుపులు వస్తాయి. లీ వూ-జిన్ ఓదాకు ఒక భయంకరమైన రహస్యాన్ని వెల్లడిస్తాడు. అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయితే ఇది ఈ మూవీలో అత్యంత షాకింగ్ ట్విస్ట్. ఈ రహస్యం తెలిసిన తర్వాత ఓదా తన ప్రతీకారం తీర్చుకుంటాడా ? అతడు తెలుసుకున్న రహస్యం ఏమిటి ? ఎందుకు అతన్ని బంధించారు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా చరిత్రలోనే గుర్తిండిపోయే అద్భుతమని చెప్పాలి.

Read Also : ప్రియురాలిని పైశాచికంగా అనుభవించే ప్రియుడు … దిమాక్ ఖరాబ్ చేసే లవ్ స్టోరీ బ్రో

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×