Naga Vamsi: ప్రస్తుతం థియేటర్లలో ఒక సినిమా విడుదల అవుతుందంటే.. దానిని థియేటర్‌కు వచ్చి చూసే ఓపిక అసలు ప్రేక్షకులకు ఉంటుందా అనే అనుమానం మేకర్స్‌లోనే మొదలయ్యింది. ఓటీటీ అనేది వచ్చిన తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది అన్నది ఓపెన్ సీక్రెట్. ఎంత స్టార్ హీరో సినిమా అయినా నాలుగు రోజులకు మించి థియేటర్లలో సందడి ఉండడం లేదు. దానివల్ల సింగిల్ స్క్రీన్స్‌పై భారీ ఎఫెక్ట్ పడుతోంది. మల్టీప్లెక్స్‌లు ఏదో ఒక విధంగా లాభాలు సంపాదించినా.. సింగిల్ స్క్రీన్స్ మాత్రం మూతబడే పరిస్థితి ఏర్పడింది. దీని గురించి వాపోతూ ఒక నెటిజన్ చేసిన ట్వీట్ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) వరకు చేరుకుంది.
ప్లీజ్ కాపాడండి
‘మల్టీప్లెక్స్‌లు అనేవి కార్పొరేట్స్‌తో సమానం. వారికి సినిమా అంటే కేవలం బిజినెస్ మాత్రమే. వాళ్లకు మూసేయాలని గానీ, థియేటర్లను తగ్గించాలని గానీ ఆలోచన వచ్చిందంటే అది చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ సింగిల్ స్క్రీన్స్ ఓనర్ల పరిస్థితి అలా ఉండదు. వాళ్లు గౌరవంతో, ప్యాషన్‌తో థియేటర్లను నడిపిస్తారు. లాభం కోసం ఆలోచించరు. థియేటర్లను అమ్మేసి, వాటిని షాపింగ్ కాంప్లెక్స్‌లాగా మారిస్తే వారికి మరిన్ని లాభాలు వస్తాయి. అయినా కూడా వాళ్లు అలా చేయకుండా సినిమా మీద ప్రేమతోనే థియేటర్లను బ్రతికించడానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత టాలీవుడ్‌కు ఉంది’ అని ఒక మూవీ లవర్ ట్వీట్ చేశాడు.
స్ట్రాటజీ వాడండి
‘ఒకవైపు నిర్మాత సినిమాను తెరకెక్కిస్తే.. మరొకవైపు డిస్ట్రిబ్యూటర్ ఆ సినిమాను స్క్రీన్ చేస్తాడు. రెండూ సినీ పరిశ్రమకు ముఖ్యమే. అలాగే సింగిల్ స్క్రీన్స్‌కు సపోర్ట్ చేయడం కూడా ముఖ్యమే. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు రాకపోవడం వల్ల షోలు క్యాన్సెల్ అవుతున్నాయి. వాటిని కాపాడడం కోసం ఇండస్ట్రీలోని నిర్మాతలు, యాక్టర్లు, డైరెక్టర్లు.. అంతా ఒక్కచోట చేరి ఏదో ఒక స్ట్రాటజీని ఉపయోగించాలి. సింగిల్ స్క్రీన్స్ నడవాలంటే అన్ని రకాల సినిమాలు రన్ అవ్వాలి. టాప్ హీరోలు, దర్శకులు 1000 కోట్ల మార్క్‌ను టచ్ చేయాలి అని లక్ష్యంతో కాకుండా ఎక్కువ సినిమాలు చేయడంపై ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఈరోజుల్లో ఎంటర్‌టైన్మెంట్ కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటన్నింటితో సినిమాలు పోటీపడి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి’ అంటూ వాపోయాడు.
Also Read: కోలీవుడ్‌లో కోల్డ్ వార్.. సిమ్రాన్, జ్యోతిక మధ్య ముదురుతున్న వివాదం..
మ్యాజిక్ తిరిగొస్తుంది
ఒక మూవీ లవర్ ఆవేదనకు సమాధానం ఇవ్వడానికి టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగవంశీ ముందుకొచ్చాడు. ‘మేము మీ బాధ అర్థం చేసుకుంటున్నాం. ఈ మేలో నాని, సూర్య, విజయ్ దేవరకొండ మీ సింగిల్ స్క్రీన్ మ్యాజిక్‌ను మళ్లీ తిరిగి తీసుకొస్తారు’ అంటూ నమ్మకం ఇచ్చాడు నాగవంశీ. ప్రస్తుతం నాని ‘హిట్ 3’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సూర్య కూడా ‘రెట్రో’తో థియేటర్లలో సందడి చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు మే 1నే విడుదల కానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ కూడా ‘కింగ్‌డమ్’ అనే మూవీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు.
We understand your concern Jeevi garu. We're confident that @NameisNani garu, @Suriya_offl garu and @TheDeverakonda garu will definitely revive the single screen magical vibe this May! https://t.co/XbDxHq94WH
— Naga Vamsi (@vamsi84) April 27, 2025