Durgamma Temple: మన దేశంలో హిందూ జనాభా ఎక్కువ. దాదాపు 80 శాతం మంది ప్రజలు హిందువులే ఉన్నారు. దేశంలో పురాతన టెంపుల్స్ ఇప్పటికీ పదిలంగా ఉన్నాయంటే.. కారణం హిందూ ప్రజలకు దైవ భక్తి ఎక్కువ. హిందువులు దేవాలయాలను పరిశుభ్రంగా చూసుకుంటారు. అందుకే ఇప్పటికీ వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుడులు, గోపురాలు దేవాలయాలు పవిత్ర స్థలాలు కాబట్టి స్నానం చేసి పద్ధతిగా తయారై వెళ్తుంటారు. ముఖ్యంగా చెప్పులను ధరించి గుడిలోకి వెళ్లడాన్ని హిందూ సాంప్రదాయంలో ఒప్పుకోరు. అలా వెళ్లడం పద్ధతి కూడా కాదు. ఇది అహంకారాన్ని తెలియజేస్తుంది. తాజాగా ఇంద్ర కీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో ముగ్గురు వ్యక్తులు చెప్పులు ధరించి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంద్ర కీలాద్రి టెంపుల్ లో ఇవాళ అపచారం జరిగింది. కీలాద్రిపై దుర్గ అమ్మ వారి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు ఘనంగా జరుగుతోన్న వేళ ముగ్గురు వ్యక్తులు కాళ్లకు చెప్పులు ధరించి టెంపుల్ లోకి ప్రవేశించారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు చెప్పులు ధరించి హల్చల్ చేశారు. అధికారులు, పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ పాదరక్షలతో వచ్చారనేది ఇంకా తెలియరాలేదు. అక్కడ వందలాది సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వచ్చి మరీ దర్శనానికి ఎలా వచ్చారని.. పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. దుర్గ అమ్మ వారి టెంపుల్ లోకి చెప్పులు ధరించి వెళ్లిన నాస్తికులపై పోలీసులు, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పైరవుతున్నారు. వందలాది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ.. వారు దర్శనానికి ఎలా వచ్చారని పోలీసులు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురు నాస్తికులు ఇలా చేయడానికి గల కారణం ఏంటి..? అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. తగిన బుద్ది చెప్పాలని.. మరో సారి ఎవరూ ఇలాంటి పనులు చేయకుండా చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.