BigTV English

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

MLC Zakia Khanam: ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారంపై దుమారం రేగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సమయం నుండి టీటీడీ అధికారులు, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా అన్ని చర్యలు పకడ్బందీగా చేపడుతున్నారు. తాజాగా తిరుమల దర్శనం టికెట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఓ భక్తుడు టీటీడీ విజిలెన్స్ వింగ్ కు ఫిర్యాదు చేయడమే. ఇంతకు ఫిర్యాదు చేసింది ఎవరిపైనో తెలుసా.. ఏపీకి చెందిన రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్ పై.


తిరుమల దర్శనం టికెట్లకు సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీలు ఇలా సిఫార్సు లేఖలు ఇస్తుంటారు. అలాగే పలువురు భక్తులు శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంకై కూడా సిఫార్సు లేఖను తీసుకుంటుంటారు. అయితే తాజాగా బెంగుళూరుకు చెందిన సాయి కుమార్ అనే భక్తుడు.. తన వద్ద సిఫార్సు లేఖ కోసం ఎమ్మెల్సీ జకియా ఖానమ్ రూ.65 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొత్తం పది టికెట్ల కోసం భక్తుడు సంప్రదించగా.. ఒక్కో టికెట్ రూ.10 వేలకు విక్రయించినట్లు సమాచారం.

ముందుగా రూ. 65 వేలు చెల్లించగా.. అసలు బ్రేక్ దర్శనం టికెట్ల విలువ తెలుసుకున్న భక్తుడు.. అసలు విషయాన్ని గ్రహించి సిఫార్సు లేఖ ఇచ్చిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్, ఆమె పీఏ, మరొకరిపై కూడా టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనితో షాక్ తిన్న టీటీడీ అధికారులు సైలెంట్ గా విచారణ నిర్వహించారట. ఆ విచారణలో నిర్ధారణ కావడంతో, తిరుమల వన్ టౌన్ లో పోలీసులకు టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు.


Also Read: TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

ఫిర్యాదుదారుల వద్ద పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ జకియా ఖానమ్, పీఆర్ఓ కృష్ణ తేజలపై కేసు నమోదు చేశారు. ఏకంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ సాక్షాత్తు ఎమ్మెల్సీపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. దీనిని బట్టి టీటీడీ ప్రతి విషయాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన టీటీడీ పూర్తి విషయాలు.. విచారణలో వెల్లడైన అనంతరం ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. అలాగే సిఫార్సు లేఖ ఎమ్మెల్సీ ప్రమేయంతోనే భక్తుల చెంతకు చేరిందా.. లేక మరేదైనా ఉందా అనే విషయాలు కూడా పోలీసుల విచారణ అనంతరం వెల్లడి కావాల్సి ఉంది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×