E-Paper
Advertisement

Hanuman Idol: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ .. నిందితుడు అరెస్ట్!

Hanuman Idol: తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ .. నిందితుడు అరెస్ట్!
Advertisement

Hanuman Idol: తిరుమల ఘాట్ రోడ్డులోని 7వ మైలురాయి వద్ద ఆంజనేయస్వామి విగ్రహం మాయమైంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే ఛేదించి తిరుమల శ్రీవారి భక్తులకు గొప్ప ఉపశమనాన్ని అందించారు.

ఘటన నేపథ్యం.. సీసీటీవీ దృశ్యాలు

Advertisement

జూలై 22 తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 7వ మైలురాయి వద్ద ఉన్న ఆంజనేయస్వామి గుడిలోని విగ్రహం చోరీకి గురైంది. అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్, తిరుపతి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. గోవిందమాల ధరించిన ఒక వ్యక్తి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.

10 ప్రత్యేక బృందాలతో గాలింపు

Advertisement

కేసు తీవ్రతను బట్టి పోలీసు యంత్రాంగం ఏకంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, టవర్ లొకేషన్లు , రవాణా మార్గాలను జల్లెడ పడుతూ నిందితుడు ఎటు వైపు వెళ్తున్నాడో నిమిష నిమిషానికి ట్రాక్ చేశారు.

హౌరా ఎక్స్‌ప్రెస్‌లో కస్టడీలోకి..

పోలీసుల పక్కా ప్లాన్ ఫలిచింది. రైల్వే పోలీసుల సహకారంతో నిందితుడు ప్రయాణిస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి దొంగిలించబడిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు.

కేవలం గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడంతో భక్తులు, టీటీడీ అధికారులు, స్థానికులు తిరుపతి పోలీసుల సమర్థతను ప్రశంసిస్తున్నారు.

Also Read:  రోడ్లెక్కి ధర్నాలా? రాహుల్, ప్రియాంకలపై ఎంపీ ఈటల సంచలన వ్యాఖ్యలు!

Related News

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

Big Stories

Advertisement
×