Tirupati Stampede : తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ యాక్షన్ కు సిద్ధమైయ్యారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరికొందరిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో పద్మావతి పార్కులో వైకుంఠ దర్శనం టికెట్ల కోసం ప్రయత్నించిన భక్తులు.. రద్దీ ఎక్కువ కావడంతో తొక్కిసలాడ చోటుచేసుకుంది. ఇందులో.. ఐదుగురు మరణించగా.. మరింత మంది గాయాల పాలైయ్యారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమి నేతలు.. గురువారం సంఘటన స్థలిని పరిశీలించారు. ఈ తరుణంలోనే ఈవోపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. డీఎస్పీ పి. రమణ కూమార్,
టీటీడీ అధికారి హారినాథ్ రెడ్డిలను సస్పెన్షన్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, ఏవీఎస్ఓ శ్రీధర్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.