Virat Kohli: ఇంగ్లాండ్ తో స్వదేశంలో వన్డే సిరీస్, టి-20 సిరీస్ ఆడేందుకు భారత జట్టు రెడీ అవుతుంది. ఆ తర్వాత ఈ ఏడాది జూన్ నెలలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్తుంది. ఈ నేపథ్యంలో తన ఫామ్, ఫిట్నెస్, టెక్నిక్ ని సానపెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Vinod Kambli Wife: మా పిల్లల చదువులకోసం సచిన్ డబ్బులు పంపాడు.. వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా
13 ఏళ్ల తర్వాత మళ్లీ విరాట్ కోహ్లీ దేశవాళి క్రికెట్ లో ఆడాలని ఫిక్స్ అయ్యారట. ఆటగాళ్లు తమ ఫామ్ కోల్పోయినప్పుడు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధన విధించిన విషయం తెలిసిందే. ఇటీవల టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇదే నిబంధనని అమలు చేస్తామని ప్రకటించడంతో ఆటగాళ్లు దేశవాలి క్రికెట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ కూడా గత కొంతకాలంగా సరైన ఫామ్ లో లేకపోవడం, టెస్టులలో దారుణంగా విఫలం కావడంతో.. తన ఫామ్ ని కంటిన్యూ చేయడానికి దేశవాళీలో ఆడనున్నాడు.
దేశవాళీలో తనను తాను నిరూపించుకొని టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 సైకిల్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే ఇంగ్లాండ్ పిచ్ ల పరిస్థితులను అలవాటు చేసుకునేందుకు ముందుగా కోహ్లీ ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టనున్నాడు.
ఐపీఎల్ 2025 తర్వాత కౌంటిల్లో కోహ్లీ భాగం కానున్నట్లు జాతీయ మీడియాలు పేర్కొంటున్నాయి. ఈసారి ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కి చేరుకోకపోతే కోహ్లీ కౌంటిలలో ఎక్కువగా మ్యాచ్ లు ఆడడానికి అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ చివరగా 2012లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. ఈ క్రమంలోనే 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ప్రారంభం కాబోతోంది.
మరోవైపు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా దేశవాళి క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యాడు రోహిత్ శర్మ. కనీసం రెండంకెల స్కోర్ చేసేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. గతంలో సెంచరీల మీద సెంచరీలు చేసిన రోహిత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మాత్రం రన్ తీయడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
దీంతో రోహిత్ కూడా ఇప్పుడు దేశవాలి క్రికెట్ ఆడాలని భావిస్తున్నారట. ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఆడితే దేశవాళీ ప్లేయర్లకు ఎంతో కొంత నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే కేవలం రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. ఫామ్ లేని టీమిండియా ఆటగాళ్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే జట్టు విజయాలు సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.
Virat Kohli likely to play County Cricket ahead of the England Test series 2025!👀 pic.twitter.com/FV6Wa7ijC7
— CricketGully (@thecricketgully) January 9, 2025