Train accident: తిరుపతిలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. భీమాస్ హోటల్ వెనుక భాగంలో రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలోని బోగీల నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. రెండు బోగీలలో మంటలు వ్యాపించాయి. ఆ పరిసర ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ట్రాక్ మార్చుతున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుంది. వెంటనే మిగితా బోగీలను వేరు చేశారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రైలు అగ్నిప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తిరుపతి రైల్వే స్టేషన్‌లో టెన్షన్.. రెండు రైళ్లలో భారీ మంటలు#Trainaccident #TTD #Tirumala #FireAccident #BIGTVCinema pic.twitter.com/N8UOB4zIfS
— BIG TV Cinema (@BigtvCinema) July 14, 2025
రాయలసీమ, ఇషార్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మంటలు చెలరేగినట్టు అధికారులు పేర్కొన్నారు. లూప్ లైన్ లో ఆగి ఉన్న రెండు రైళ్లలో అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలిపారు. ఫైర్ సిబ్బంది రెండు బోగీలలో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నట్టు అధికారులు వివరించారు. ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని పేర్కొన్నారు.
ALSO READ: APMSRB Recruitment: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హత ఉంటే చాలు