Hanumakonda Crime: పచ్చని సంసారంలో రీల్స్ వ్యవహారం చిచ్చురేపింది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఈ పంచాయితీ పెద్దల వరకు వెళ్లింది. భర్త వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడింది డాక్టర్ ప్రత్యూష. ఆమె భర్త డాక్టర్ సృజన్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది.
హనుమకొండ జిల్లాలో డాక్టర్లు పని చేస్తున్నారు ప్రత్యూష-సృజన్. నగరంలోకి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్‌గా పని చేస్తోంది. మరో ఆసుపత్రిలో డాక్టర్ సృజన్ కార్డియాలజిస్ట్‌గా ఉన్నారు. వీరిద్దరు భార్యభర్తలు. కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. పచ్చనికాపురంలో రీల్స్ వ్యవహారం చిచ్చురేపింది.
సోషల్‌మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి ఇటీవల డాక్టర్ సృజన్‌ను ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్‌గా చేసి ఆయనను ప్రమోట్ చేసింది. డాక్టర్ సృజన్-సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం మొదలైంది. చివరకు అది ప్రేమగా మారింది. తర్వాత భర్త వ్యవహారశైలిలో మార్పులను గమనించింది భార్య ప్రత్యూష.
చివరకు భర్తను నిలదీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య విబేధాలు ముదిరాయి. తారాస్థాయికి చేరాయి. ఇరు కుటుంబాలు పెద్దలు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సృజన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. తన భర్త అలా చేయడాన్ని తట్టుకోలేకోపోయింది. హసన్‌పర్తిలో తన ఇంట్లో ఉరి వేసుకుంది డాక్టర్ ప్రత్యూష.
ALSO READ: తిరుపతి రైలులో భారీగా మంటలు, బోగీలు బుగ్గిపాలు
ఉన్నట్లుండి కూతురు ఆత్మహత్య చేసుకోవడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. హసన్‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రత్యూష భర్త సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కూతురు మరణానికి కారణమైన సృజన్‌ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రత్యూష పేరెంట్స్. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
భర్త వేధింపులు.. డెంటిస్ట్ ఆత్మహత్య..
హనుమకొండలోని హసన్ పర్తిలో విషాదం
ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దంత వైద్యురాలు ప్రత్యూష
భర్త వేధింపులతోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లి ఫిర్యాదు
పోలీసుల అదుపులో ప్రత్యూష భర్త డాక్టర్ సృజన్ pic.twitter.com/rU9Vm0A6GD
— BIG TV Breaking News (@bigtvtelugu) July 14, 2025