BigTV English

Tractor Accident: బాపట్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Tractor Accident: బాపట్లలో దైవ దర్శనానికి వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు దుర్మరణం

Tractor Accident in Bapatla: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్లపాలెం మండలంలోని యాజలిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


దమన్నదారిలో దేవస్థానానికి ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు గట్టువారిపాలెం వాసులుగా గుర్తించారు. వీరంతా కొండపాటూరు పోలెరమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉదయం బయలుదేరారు.

దమన్నదారిలో ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 14 మంది ఉన్నట్లు గుర్తించారు. కొండపాటూరు పోలెరమ్మ తల్లి దేవస్థానం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ట్రాక్టర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: ఘోర రోడ్డుప్రమాదం.. అన్నదమ్ములు మృతి

వాహనాలను నడుపుతున్న సమయంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రతీ ఒక్కరికి కుటుంబం ఉంటుందనే విషయం మర్చిపోవద్దని, డ్రైవర్లు కూడా మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనాలను నడపాలన్నారు. అతివేగంతో వాహనాలను నడిపి ప్రమాదాలకు గురికావొద్దన్నారు. అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×