Norovirus in Hyderabad : కరోనా.. దీనిని తలచుకుంటే ఇప్పటికీ ఎవరికైనా వెన్నులో వణుకు మొదలవుతుంది. 2020లో భారత్ లో కరోనా సృష్టించిన అలజడి, మోగించిన మరణ మృదంగం అలాంటిది మరి. కోట్లాదిమంది ఈ వైరస్ బారిన పడ్డారు. అధికారిక లెక్కల ప్రకారం 5 లక్షల 33 వేల 570 మంది కరోనా కారణంగా మరణించారు. కరోనా వైరస్ తర్వాత.. అందులోనే అనేక సబ్ వేరియంట్ వైరస్ లు వ్యాపించాయి. వాటిలో ఒమిక్రాన్ కూడా ప్రజలను భయపెట్టింది.
అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కొత్తవైరస్ ఒకటి వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. నొరో వైరస్ నగరంలోకి ప్రవేశించింది. రోజుకు 100-120 వరకూ కేసులు నమోదవుతున్నాయని, నగరంలో ఉన్నవారంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ.. X వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. సీజనల్ వ్యాధులు ఈజీగా వ్యాపించే కాలం కావడంతో.. జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
Also Read : చేదుగా ఉన్నా సరే ఈ జ్యూస్ తాగితే ప్రాణాంతకర వ్యాధులన్నీ పరార్..
వర్షాకాలంలో సాధారణంగానే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. వీటికి తోడు ఇప్పుడు నొరో వైరస్ కూడా రావడం ఆందోళనకు గురిచేస్తోంది. కలుషితమైన ఆహారం, నీటిద్వారానే ఈ వైరస్ వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ బారిన పడినవారిలో 48 గంటల్లోనే వాంతులు, విరేచనాలు, చలి-జ్వరం, నీరసం, డీహైడ్రేషన్, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నొరో వైరస్ కట్టడికి ప్రస్తుతం వ్యాక్సిన్, మెడిసిన్ లేదని, డాక్టర్లు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ.. వాళ్లు ఇచ్చిన మెడిసిన్ వేసుకోవాలని జీహెచ్ఎంసీ సూచించింది. అలాగే కాచి, చల్లార్చి, వడపోసిన నీటినే తాగాలని, చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని తెలిపింది. అలాగే ఇంటిని, చుట్టూ పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.
నొరోవైరస్ వ్యాధితో జాగ్రత్త!!
కలుషిత నీరు, ఆహారం కారణంగా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
లక్షణాలు
చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రేషన్.తీసుకోవాల్సిన జాగ్రత్తలు
👉 చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
👉కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
👉ఇంటిని,… pic.twitter.com/n3IcqPC2w6— GHMC (@GHMCOnline) July 27, 2024