E-Paper
Advertisement

AP train accident : పలు రైళ్లు రద్దు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే

AP train accident : పలు రైళ్లు రద్దు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
Advertisement
Vizianagaram train accident news

Vizianagaram train accident news(AP news live):

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదం కారణంగా.. పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే అధికారులు ప్రకటించారు. మరికొన్నింటిని దారిమళ్లించారు. రత్నాచల్, సింహాద్రి,ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పూరీ ఎక్స్ ప్రెస్ లు రద్దయ్యాయి.

రద్దైన రైళ్లు..

Advertisement

విజయవాడ-విశాఖ (12718)రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం – విజయవాడ (12717) ఎక్స్ ప్రెస్, గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ-విశాఖ (17267)మెము రైలు, రాజమండ్రి-విశాఖ (07466) మెము ఎక్స్ ప్రెస్, గుంటూరు-రాయగడ్‌ (17243) ఎక్స్‌ప్రెస్‌, కోరాపుట్‌-విశాఖ (08545) స్పెషల్, విశాఖ-కోరాపుట్‌ (08546) స్పెషల్, చెన్నైసెంట్రల్ -పూరీ (22860) ఎక్స్ ప్రెస్, రాయగఢ్‌-గుంటూరు (17244) ఎక్స్‌ప్రెస్‌, విశాఖ-గుంటూరు (17240) ఎక్స్‌ప్రెస్‌ లు సోమ, మంగళవారాల్లో రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

దారిమళ్లించిన రైళ్లు..

Advertisement

ధన్ బాద్ నుంచి ఈ నెల 29న బయల్దేరిన ధన్ బాద్ – అలెప్పీ బొకారో ఎక్స్ ప్రెస్ (13351)ను ఝార్సుగూడ, రాయ్ పుర్, నాగ్ పుర్, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. అలాగే హతియా నుంచి 29న బయల్దేరిన హతియా – ఎస్ఎంవీ బెంగళూరు ఎక్స్ ప్రెస్ (12835)ను ఝార్సుగూడ, రాయ్ పుర్, నాగ్ పుర్, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. విజయవాడ- నాగ్ పుర్ – రాయ్ పుర్ – ఝార్సుగూడ – ఖరగ్ పూర్ మీదుగా.. మంగుళూరు-సంత్రాగాచీ ఎక్స్‌ప్రెస్‌, బెంగళూరు-హౌరా, తిరుపతి-హౌరా, సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా, బెంగళూరు-హౌరా, బెంగళూరు-జేసిద్ద్‌, చెన్నై – హౌరా, వాస్కోడిగామా – షాలిమార్ ఎక్స్ ప్రెస్ లను దారిమళ్లించారు.

విజయనగరం రైలు ప్రమాదంపై సమాచారం కావాల్సిన వారికోసం అధికారులు విశాఖ రైల్వే స్టేషన్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052,
85000 41670, 85000 41671 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే విజయనగరంలో 08922 221206, 08922 221202 నంబర్లను అందుబాటులో ఉంచారు. విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 9030226621, 7036111169, 08912590102 నంబర్లను సంప్రదించవచ్చు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×