BigTV English

IND vs ENG Match: ఇండియా.. ఆ మూడు వికెట్లు? కొందరు సీరియస్.. కొందరు సపోర్ట్

IND vs ENG Match: ఇండియా.. ఆ మూడు వికెట్లు? కొందరు సీరియస్.. కొందరు సపోర్ట్

Ind vs Eng match highlights(ICC cricket world cup 2023) :


సూర్యుడు తూర్పునెలా ఉదయిస్తాడో…
అయ్యర్ షార్ట్ పిచ్ బాల్ కు అలా అవుట్ అవుతాడు…

జరిగినదంతా మన మంచికే….


ఇప్పుడైనా బలహీనతల నుంచి బ్యాట్స్ మెన్లు బయటపడాలి…

మారరా? ఇంక మీరు మారరా?

మంచి ఊపుమీదున్న ఇండియాకి జయహో చెబుదాం…

ఇలా ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ అనంతరం నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఇండియాకి జరిగిన మ్యాచ్ లన్నీ ఒకెత్తు అయితే, ఇంగ్లండ్ జరిగినది ఒక ఎత్తుగా మారింది. ఇలా అనేకంటే ఒక  సవాల్ ని విసిరిందని చెప్పాలి. ఏదో బౌలర్లు కూడా సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇండియా బతికి బట్టకట్టింది గానీ లేకుండా,
పరారే…పరారే…అన్నట్టు అయిపోయేదని అంటున్నారు.

ముఖ్యంగా ఇండియన్ బ్యాట్స్ మెన్ ముగ్గురు అవుట్ అయిన విధానం మాత్రం సర్వత్రా విమర్శల పాలవుతోంది. అదృష్టవశాత్తూ గెలిచాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ముగ్గురు బ్యాట్స్ మెన్లపై జనం పడిపోయేవారని అంటున్నారు. ఇన్ని సార్లు అవుట్ అయినా మీరు మారరా? అని ప్రశ్నిస్తున్నారు.

లీగ్ దాటాక జరగబోయే నాకౌట్ మ్యాచ్ ల్లో టీమ్ ఇండియా ఈ బలహీనతల నుంచి బయటపడాలని కోరుతున్నారు. అంతా మన మంచికే జరిగింది…ఈ దొరికిన కొద్ది సమయం ఇలాంటి బాల్స్ తో ఎలా ఆడాలో నెట్ ప్రాక్టీస్ చేయాలని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు.

ప్రతి వాడు చెప్పేవాడే…అక్కడెంత ఒత్తిడి ఉంటాదో తెలుసా? అనేవాళ్లు కూడా ఉన్నారు…

లఖ్ నవ్ పిచ్ కఠినంగా ఉండటంతో క్రిస్ వోక్స్ వేసిన ఒక అద్భుతమైన బంతికి శుభ్ మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తననెవరూ తప్పు పట్టలేదు.

తర్వాత విరాట్ కొహ్లీ కూడా క్రీజులోకి వచ్చిందగ్గర నుంచి ఆద్యంతం అసహనంగానే ఉన్నాడు. అసలు పిచ్ నుంచి సహకారం లేదు. అప్పటికే 8 డాట్ బాల్స్ ఆడాడు. ఇక లాభం లేదనుకొని డేవిడ్ విల్లీ బౌలింగ్ లో అనవసరపు షాట్ కొట్టి, క్యాచ్ ఇచ్చేశాడు.

ఒక సీనియర్ క్రికెటర్ అయ్యి ఉండి, ఇలాంటి పిచ్ మీద తనలాంటి అనుభవజ్నుడి అవసరం ఎంతో ఉండి కూడా అలా అసహనంతో వికెట్ పారేసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.
అయితే తనింతవరకు వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. కాకపోతే తను మంచి బాల్ కి అవుట్ అయిపోతే పర్వాలేదు. కానీ తనంతట తాను సంయమనం కోల్పోయి అవుట్ కావడమే ఇప్పుడు విమర్శల పాలవుతోంది.

తర్వాత శ్రేయాస్ అయ్యర్…ఇంతవరకు జరిగిన మ్యాచ్ ల్లో తనకి సరైన అవకాశమే రాలేదు. రోహిత్, గిల్, కొహ్లీ వీరే లాగించేస్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సరికదా ఎప్పటిలా షార్ట్ పిచ్ బంతికి మార్క్ వుడ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే శ్రేయాస్ పై నెటిజన్లు మండి పడుతున్నారు.

సూర్యుడు తూర్పునెలా ఉదయిస్తాడో, అయ్యర్ షార్ట్ పిచ్ బాల్ కి అలా అవుట్ అవుతాడని కొటేషన్లు కొడుతున్నారు.

ఇక ఆఖరిగా కేఎల్ రాహుల్ అవుట్ అయిన తీరు వివాదస్పదమైంది. రోహిత్ కి అప్పటివరకు సపోర్ట్ గా ఉన్న రాహుల్ కీలక సమయంలో అనవసరమైన షాట్ కొట్టి అవుట్ అయ్యాడు. 58 పరుగుల్లో 39 పరుగులు చేసిన రాహుల్ కూడా డేవిడ్ విల్లీ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
ఇదే పిచ్ పై ఐపీఎల్ లో ఎన్నో మ్యాచ్ లు ఆడిన రాహుల్ ఇలా అవుట్ కావడం సరికాదని అంటున్నారు.
ఇంక మీరు మారరా? మీరు మారనే మారరా? అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

జరిగినదంతా మన మంచికే, ఇక్కడ నుంచైనా మనవాళ్లు జాగ్రత్తగా ఆడి, సెమీస్, ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ల్లో బలహీనతల నుంచి బయటపడతారని సీనియర్లు ఆకాంక్షిస్తున్నారు. మంచిగా ఆడుతున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. నెటిజన్లు కూడా సంయమనం పాటించాలని సూచిస్తున్నారు.

కొందరేమో…కామెంట్లు పెట్టేవాళ్లని ఉద్దేశించి, క్రికెటర్స్ ని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
మీరేదో పెద్ద తురుంఖాన్ ల్లా ఫీలవకండి… ఇంటర్నేషనల్ గేమ్స్ లో ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా? కామెంట్ చేసేటప్పుడు కొద్దిగా చూసి చేయండి అని ఇండియన్స్ కి సపోర్ట్ గా కొందరు నిలుస్తున్నారు.
మొత్తానికి ఇండియా పై నెగ్గి విజయం సాధించి…మంచి ఊపుమీదున్న టీమ్ ఇండియాకి జయహో చెబుదామని కొందరంటున్నారు.
ఇండియా గెలిచినా నెగిటివ్ కే ప్రాధాన్యం పెరిగిపోయిందని కొందరంటున్నారు.
చూశారు కదండీ…మరి మీరేమని అనుకుంటున్నారు? ఒక ఆలోచన చేయండి…

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×