E-Paper
Advertisement

వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం

వైద్యురాలి తలపైకి కారు ఎక్కించి.. రాజమండ్రిలో దారుణం, మాల్‌లో యువకులు అఘాయిత్యం
Advertisement

Rajahmundry Doctor: మద్యం మత్తు క్షణికావేశం ఈ దుర్మార్గులు చేసిన యాక్సిడెంట్ ని ఇంత చిన్న చిన్న పదాలతో తేల్చి చెప్పడానికి మనసొప్పడం లేదు. కారణం వీరి నిర్వాకం కాస్తా ఒక నిండు ప్రాణాన్ని చావు బతుకుల మధ్యకు నెట్టేసింది. ఈ ఘటన జరిగింది రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర. మందుకొట్టిన మత్తోన్మాదుల వల్ల బలై పోయిందో ఫ్యూచర్ డాక్టర్. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఆ యువతి తలపై నుంచి తమ వెహికల్ ఎక్కించారా మద్యం మత్తుగాళ్లు. దీంతో షాకై పోయారు ప్రత్యక్ష సాక్షులు.

ఇంజినీరింగ్ స్టూడెంట్స్..

నామవరానికి చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్స్ దస్వంత్, జోసఫ్.. విపరీతంగా మందు కొట్టి.. మాల్ లోకి వచ్చారు. అక్కడ కూడా మత్తులో ఇష్టారాజ్యం చేశారు. అప్పటికీ మాల్ సెక్యూరిటీ వీరిని బయటకు పంపేందుకు ట్రై చేశారు. గేటు దాటేటప్పుడు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గాళ్లు.. సెక్యూరిటీతో గొడవ గొడవ చేశారు.

Advertisement

Also Read: CJP ఫౌండర్ అభిజిత్ దీప్కే పై పోక్సో కేసు నమోదు!

జెట్ స్పీడ్‌‌తో..

సెక్యూరిటీపై ఉన్న కోపంతో రగిలిపోయిన ఈ ఉన్మాదులు కారును జెట్ స్పీడ్ తో పోనిచ్చారు. సరిగ్గా అదే టైంలో గేటు ముందు నుంచి వెళ్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టారు. స్కూటీ వెనక కూర్చున్న మెడికల్ స్టూడెంట్ కి గట్టిగా దెబ్బలు తాకాయి. ఆమె కింద పడిపోయింది. దీంతో అడ్డుకున్న సెక్యూరీటిని డామినేట్ చేస్తూ దూసుకోళ్లడంలో భాగంగా ఆమె తలపై నుంచి కారు తొక్కిస్తూ రాక్షసంగా ముందుకెళ్లారు.

బ్రెయిన్ డెడ్..

Advertisement

ఈ ప్రమాదంలో గాయపడ్డ మెడికోను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో బ్రెయిన్ డెడ్ గా నిర్దారించారు డాక్టర్లు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని హైదరాబాద్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన రాజమండ్రి పోలీసులు మందుబాబులిద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవి.. స్పందించిన టీమ్!

Also Read: రష్యాను వణికిస్తున్న రాక్షస మిడతల దండు.. భారీ ప్రమాదం అంచులో ఆసియా దేశాలు

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×