E-Paper
Advertisement

విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా – మల్లాది విష్ణు వర్గాల తోపులాట.. డీఎస్సీ దీక్షలో హై టెన్షన్!

విజయవాడలో ఉద్రిక్తత.. బోండా ఉమా – మల్లాది విష్ణు వర్గాల తోపులాట.. డీఎస్సీ దీక్షలో హై టెన్షన్!
Advertisement

TDP vs YSRCP: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయాంటూ విజయవాడలోని ముత్యాలపాడులో వైసీపీ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్రిక్తతలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంలో కూర్చొని ధర్నా చేస్తుండగా.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ దీక్ష చేస్తున్న ప్రాంతంలో లోకేశ్ ప్లెక్సీని ఏర్పాటు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో.. ఇరుపార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది.

దీంతో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను వారించి.. పరిస్థితులు చెక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన మల్లాది విష్ణుతో పాటు పలువురు వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి బలవంతంగా స్టేషన్ కు తరలించారు. అయితే మంత్రి నారా లోకేశ్ ప్రోద్భలంతోనే బోండా ఉమా.. దీక్షా శిబిరం వద్దకు చేరుకొని విధ్వంసానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది.

Advertisement

అంతకుముందు పోలీసులు అరెస్టు సమయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గుండాయిజం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు శిబిరం వద్దకు వచ్చి దాడికి దిగడంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. మహిళలు అని చూడకుండా వైసీపీ నేతలను సైతం గాయపరిచారని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ మహిళా కార్యకర్త ఘటనా స్థలిలోనే స్పృహ తప్పి పడిపోయిందని వైసీపీ ఆరోపిస్తోంది.

Also Read: BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

Advertisement

మరోవైపు బోండా ఉమా సైతం ఈ ఘటనపై స్పందించారు. వైసీపీకి ఇక్కడ నిరసన తెలిపే హక్కు లేదన్నారు. డీఎస్సీలో అవకతవకలు ఉంటే బహిరంగకు సిద్ధమని ఇప్పటికే లోకేశ్ ప్రకటించారని అన్నారు. ఆ సవాలుకు ఇంతవరకూ ఎవరూ స్పందించలేదన్నారు. అయితే దీక్ష మాటున తమ నేతలు చంద్రబాబు, లోకేశ్ లను తిడుతున్నారని.. అది చూసే ఇక్కడికి వచ్చానని అన్నారు. తమ నాయకులను బూతులు తిడితే తోలు తీస్తామంటూ ఘాటుగా హెచ్చరించారు.

Also Read: ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×