E-Paper
Advertisement

రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!

రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!
Advertisement

Anitha Jagan: ఇవి గొడ్డలి పార్టీ అధ్యక్షుడి అరాచకాలంటూ జగన్ మోహన్ రెడ్డిపై హోం మంత్రి అనిత విరుచుకు పడ్డారు. పరామర్శల పేరుతో విధ్వంసం, అరాచకం సృష్టిస్తున్నారమంటూ అనిత ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పరామర్శల పేరుతో జగన్ సృష్టించిన విధ్వంసాన్ని వివరిస్తూ మీడియాకు వంగలపూడి అనిత ప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్ పర్యటనల్లో సృష్టించిన అరాచకాల వీడియోలను మంత్రి అనిత చూపించారు. తన రాజకీయం కోసం సామాన్యులను పేదలను గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఇబ్బంది పెడుతున్నారన్న హోం మంత్రి ఫైర్ అయ్యారు.

ముగ్గురు ప్రాణాలు బలి..

రెండేళ్ల కాలంలో జగన్ చేసిన పర్యటనల వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించిన మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఓవైపు విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటిలేటర్ పైనున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరో వైపు గొడ్డలి పార్టీ అధ్యక్షుడు విధ్వంసం, అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడి అడుగు ఎక్కడ పడితే అక్కడ వినాశనమే మహిళలకు రక్షణ ఉండడం లేదు. సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, విద్వేషాలు రెచ్చగొట్టడం అరాచకాలతో ఉద్రిక్తతలు సృష్టించడమే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు పనిగా పెట్టుకున్నారని తెలిపారు.

Advertisement

Also Read: యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

ఆస్తులను విధ్వంసం

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ పర్యటనలు చేయవచ్చు.. నిరసనలు తెలపొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ మేమూ నిరసనలు తెలిపామని, కానీ ప్రజలను భయభ్రాంతులను చేస్తూ ప్రజలను బెదిరిస్తూ పరామర్శల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రెండేళ్లల్లో జగన్ చేసిన పర్యటనల్లో ముగ్గురు చనిపోయారు. సామాన్యుల జీవితాలను ఇబ్బంది పెట్టారు. వారి ఆస్తులను విధ్వంసం చేశారని అన్నారు. మిర్చి రైతుల పరామర్శ పేరుతో గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను తన బౌన్సర్లతో కొట్టించారని, మిర్చి టిక్కీలను గొడ్డలి పార్టీ నేతలు దొంగతనం చేశారన్నారు. పరామర్శ పేరుతో బల ప్రదర్శనలు చేసి రైతులను కొట్టి దొంగతనాలు చేస్తారా ఇదేం తీరు అని ఫైర్ అయ్యారు.

తెనాలిలో గంజాయి బ్యాచ్..

Advertisement

రాప్తాడులో హెలికాప్టర్‌పై దాడికి వచ్చారని మరో నాటకం ఆడారు. ఓ సీఐ మీద స్వయంగా గొడ్డలి పార్టీ కార్యకర్తలతో దాడి చేయించారని తిరిగి హెలీకాప్టర్ పై దాడి చేశారంటూ తప్పులు ఆరోపణలు చేశారన్నారు. గతేడాది జూన్ నెలలో పొదిలిలో పొగాకు రైతులను పరామర్శిస్తామనే పేరుతో మళ్లీ మహిళలు, పోలీసులపై దాడులు చేశారు.పొగాకు బేళ్లను తొక్కి నాశనం చేశారు. తెనాలిలో గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లను కంట్రోల్లో పెట్టాలని పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని కూడా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు తప్పు పట్టారని ఫైర్ అయ్యారు. జగన్ చేసే బలప్రదర్శనల్లో యువతను రెచ్చగొట్టి రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నారని, ప్లకార్డులను ప్రదర్శించమని చెబుతున్నారని తెలిపారు.

Also Read: ఈనెల 6 నుంచి మీ ఇంటివద్దకు కరెంట్ ఆఫీసర్లు.. ఎందుకో తెలుసా?

Tags

Related News

కూటమి ప్రభుత్వం కొత్త ట్రెండ్.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు శుభవార్త, ప్రత్యర్థి శిబిరంలో వణుకు

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

Big Stories

Advertisement
×