E-Paper
Advertisement

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!
Advertisement

YSRCP MPs: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీలు సమావేశ మయ్యారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అమిత్ దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకెల్లారు. మూడు అంశాలపై ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు పై అమిత్ షా కు ఫిర్యాదు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

జగన్ పర్యటనలో..

కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తగినంత భద్రత కల్పించడంలో విఫలమవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. నిన్న జగన్ మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా లక్షలాది మంది ప్రజలు గుమిగూడినప్పటికీ, పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయలేదని ఎంపీలు తెలిపారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఆయన జరిపే అన్ని బహిరంగ పర్యటనలలో ఇదే పద్ధతి కొనసాగుతోందని, అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం దురుద్దేశంతో ఇలా చేస్తోందని ఆరోపించారు.

డీఎస్సీ నియామకాలలో అవకతవకలు

Advertisement

డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాను దుర్వినియోగం చేశారని ఆరోపించిన వైసీపీ ఎంపీలు తెలిపారు. అవినీతి, అవకతవకల కారణంగా అర్హులైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నారని, దీనివల్ల నిరుద్యోగ యువత, విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని ఎంపీలు పేర్కోన్నారు. నియామక ప్రక్రియపై నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని ఎంపీలు డిమాండ్ చేసారు.

Also Read: యూపీఐ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. పేమెంట్స్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం!

క్షీణిస్తున్న శాంతిభద్రతలు

Advertisement

వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులను అక్రమ నిర్బంధాలు, రాజకీయ ప్రేరేపిత కేసుల ద్వారా లక్ష్యంగా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఎంపీల ఆరోలు చేశారు. మాజీ మంత్రి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యే విరూపాక్షల అరెస్టులను ఉదాహరణగా పేర్కొన్నారు. గత రెండు నెలల్లో లాకప్‌లలో నలుగురు మరణించినట్లు వచ్చిన వార్తలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తూ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు డిమాండ్ చేశారు.

డిమాండ్స్..

అధికార పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు రోడ్లను దిగ్బంధించి, భారతీ సిమెంట్స్ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూ దానిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్న ఎంపీలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతికూలంగా ప్రభావితం చూపిస్తాయని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు, ప్రజా భద్రత, చట్టబద్ధమైన పాలన, నిష్పక్షపాత పెట్టుబడి వాతావరణం ఉండేలా చూడాలని అమిత్ షా వైసీపీ ఎంపీలు కోరారు.

Also Read: మరో వేటకు సిద్ధమవుతున్న హైడ్రా.. 176 కాలేజీలపై హైడ్రా అధికారులు గురి!

Tags

Related News

ట్రావెల్ బస్సులో అగ్నిప్రమాదం.. ప్రమాదం సమయంలో 38 మంది ప్రయాణికులు, శ్రీశైలంలో ఘటన

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవు

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. హైకోర్టు విచారణపై స్టే, ఈనెల 30 లోపు..

శ్రీకాకుళంలో విషాదం.. టెక్కలి వద్ద రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం!

మెగా డీఎస్సీ రచ్చ.. 250 మంది వైసీపీ నేతలపై అట్రాసిటీ కేసులు!

ఏపీలో పొంగి ప్రవహిస్తున్న వాగులు-వంకలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష, కంట్రోల్ రూమ్ నెంబర్లు

ఏపీలో పింఛన్‌దారులకు బిగ్ అలర్ట్.. కేంద్రం వాటా బ్యాంక్ ఖాతాలోకి, ఒకసారి చెక్ చేసుకోండి?

ధర్మవరంలో కేతిరెడ్డి మాస్టర్ స్ట్రోక్.. ఆ మాజీ కౌన్సిలర్లకు మైండ్ బ్లాంక్!

Big Stories

Advertisement
×