TTD Chairman BR Naidu: భక్తులందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలోనే ఒకాయన వచ్చి సైలెంట్ గా పక్కన నిలబడ్డారు. అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ తర్వాత ఒకరినొకరు మాటలు కలుపుకున్నారు. అప్పుడే మధ్యలో కలిసిన వ్యక్తి.. తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయా లేవా అంటూ అడిగారు. వారందరూ చాలా బాగున్నాయి అంటూ కితాబిచ్చారు. అంతేకాకుండ సామాన్య భక్తులకు దర్శనం వీలుగా ఉందంటూ చెప్పారు. అంతలోనే వీరిలో కలిసిన వ్యక్తి వద్దకు మరో నలుగురు వచ్చేశారు. వారందరినీ చూసి అందరూ షాక్. ఇంతకు వీరితో పాటు సైలెంట్ గా కూర్చొని మాట్లాడింది ఎవరో తెలుసా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతలు చేపట్టిన అనంతరం నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు కూడ తీసుకున్నారు. తిరుమల స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం, సామాన్య భక్తులకు 2 గంటల్లో దర్శనం, అన్యమతస్త ఉద్యోగులపై నిర్ణయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నిర్ణయలతో తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండ చర్యలు తీసుకుంటున్నారు.
అయితే జనవరి 10వతేదీ నుండి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో రానున్న సంధర్భంగా ఏర్పాట్లను చైర్మన్ ఆదివారం పరిశీలించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులు సంయమనం పాటించి తిరుపతిలో జారీ చేయనున్న ఎస్ఎస్ డీ టోకెన్లు పొందాలని కోరారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వైకుంఠ ఏకాదశికి అధికారులు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ యంత్రాంగం విశేష కృషి చేస్తోందన్నారు.
Also Read: DRDO Jobs: DRDOలో జాబ్స్.. ఉద్యోగం వస్తే నెలకు రూ.37000 స్టైఫండ్
ఆ తర్వాత సామాన్య భక్తుడిలా భక్తుల వద్దకు వెళ్లారు. ప్రోటోకాల్ ప్రక్కనపెట్టి సామాన్యభక్తుడిలా చైర్మన్ వెళ్ళగా, ఆయన సిబ్బంది షాక్ తిన్నారు. శ్రీవారి ఆలయం వద్దకు వెళ్లిన చైర్మన్ బీఆర్ నాయుడు నాదనీరాజనం వద్ద కూర్చోని అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించారు. ఈ సంధర్భంగా టీటీడీ అందిస్తున్న సౌకర్యాల పట్ల భక్తుల అభిప్రాయాలను చైర్మన్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లడ్డూ, అన్నప్రాదాలు నాణ్యంగా రుచికరంగా ఉన్నాయని, పరిశుభ్రత పెరిగిందని భక్తులు తెలిపారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్న చైర్మన్, అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లారు. సామాన్య భక్తుడిలా మాట్లాడిన చైర్మన్ ను చూసి, టీటీడీ అధికారులు, సిబ్బంది షాక్ తిన్నారు.