DRDO Jobs: బీటెక్ పాసై గేట్ స్కోర్ ఉన్నవారికి గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 25
ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. మరియు 2023 లేదా 2024 సంవత్సరాల్లో GATE స్కోర్ కలిగి ఉండాలి. లేదా.. సంబంధిత విభాగాల్లో ME / M.Tech పూర్తి చేసిన వారు కూడా అర్హులవుతారు.
వయస్సు: 2024 డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్లు మించరాదు.
ఉద్యోగ ఎంపిక విధానం: అర్హత ఉన్న వారికి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక చేస్తారు. అర్హత గల వారు అఫీషియల్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్న ఫామ్ ఫిలప్ చూపి jrf.rectt.cabs@gov.in మెయిల్ చేయాలి.
స్టైఫండ్: ఎంపికైన వారికి నెలకు రూ.37,000 స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: జనవరి 24 లోగా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలను రెండేళ్ల కాలపరిమితికి భర్తీ చేసుకుంటున్నారు. అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో రెండేళ్లు వరకు కొనసాగించే అవకాశం ఉంటుంది.
Also Read: Jobs in Hydra: హైడ్రాలో ఉద్యోగాలు.. త్వరలోనే సూపర్ నోటిఫికేషన్..
జనవరి 28వ తేదీన ECE, Electrical విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
జనవరి 29వ తేదీన ఏరోనాటికల్ మరియు మెకానికల్ విభాగాల వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
కంప్యూటర్ సైన్స్ విభాగాల వారికి జనవరి 30వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఉద్యోగం చేయాల్సిన ప్లేస్: Centre for Airborne System (CABS), DRDO, Ministry of Defence, Belur, Yemlur PO, Bengaluru – 560037.