Thalapathy 69: ఈరోజుల్లో చాలామంది హీరోలకు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని కలలు కంటున్నారు. అందులో చాలామంది తమ కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా టాలీవుడ్ నుండి ఎన్నో ఆశలతో పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. అలాగే కోలీవుడ్ నుండి విజయ్ కూడా చాలాకాలం పొలిటికల్ ఎంట్రీ గురించి కలలు కంటున్నారు. పొలిటికల్ కెరీర్ కోసం సినిమాలను సైతం పక్కన పెట్టేయడానికి సిద్ధమయ్యారు. ఎన్నో ఏళ్లుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ గురించి కోలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. అంతే కాకుండా విజయ్ కెరీర్‌లో హీరోగా తెరకెక్కే చివరి చిత్రం ‘దళపతి 69’ గురించి కూడా ఒక రూమర్ వైరల్ అవుతుండగా దానిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
దర్శకుడు క్లారిటీ
విజయ్ తన కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న ‘దళపతి 69’ షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసుకొని పాలిటిక్స్‌లో పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని కోరుకుంటున్నాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. మమితా బైజు, ప్రియమణి లాంటి ఇతర హీరోయిన్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతే కాకుండా అప్పటినుండి ‘దళపతి 69’ ఒక రీమేక్ అని కూడా రూమర్స్ వస్తుండగా దానిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.
Also Read: అక్కడ ‘కల్కి 2898 ఏడీ’కి మిక్స్‌డ్ రివ్యూలు.. హిట్ కొట్టడం కష్టమే.?
రీమేకా.? కాదా.?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు ‘దళపతి 69’ రీమేక్ అని పూజా కార్యక్రమాలు జరిగినప్పటి నుండి రూమర్ వినిపిస్తూనే ఉంది. దానికి మూవీ టీమ్ ఏ రకంగా స్పందించకపోవడం వల్ల ఇది రీమేకే అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. మొత్తానికి ఇది రీమేక్ అని క్లారిటీ ఇచ్చాడు హెచ్ వినోద్. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ‘దళపతి 69’ (Thalapathy 69) రీమేక్ కాదని, 200 శాతం ఇదొక ఒరిజినల్ కంటెంట్ అని విజయ్ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. దీంతో అటు విజయ్ ఫ్యాన్స్‌లో, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కాస్త రిలీఫ్ కనిపిస్తోంది. ‘దళపతి 69’ ఇదే ఏడాది విడుదలకు సిద్ధమవుతుండగా దానిపై అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి.
చివరి సినిమా
హెచ్ వినోద్ (H Vinoth) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న ‘దళపతి 69’ గురించి ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియనే ఉంది. ఇది విజయ్‌కు గుర్తుండిపోయే చివరి సినిమా చేయాలని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. చివరిగా లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘లియో’లో హీరోగా కనిపించాడు విజయ్ (Vijay). దాని తర్వాత హెచ్ వినోద్‌తో మూవీ అని ప్రకటించాడు. ఈ మూవీ ప్రకటన జరిగిన తర్వాత ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్న సమయంలోనే రాజకీయాల గురించి అధికారికంగా ప్రకటించాడు విజయ్. దీంతో ఇదే తన కెరీర్‌లో చివరి సినిమా కానుందని వారికి క్లారిటీ వచ్చేసింది. విజయ్ కూడా స్వయంగా ఇదే మాటను స్పష్టం చేశాడు.