Honey Rose:ప్రముఖ మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ (Honey Rose) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ (Balakrishna) ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించి తన అద్భుతమైన నటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. తన అంద చందాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు కానీ హీరోయిన్ గా మాత్రం అవకాశాలు తలుపు తట్టలేదు. దీంతో పలు మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీగానే సంపాదిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తాను లైంగికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ ఊహించని కామెంట్లు చేసింది. దీంతో ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
లైంగికంగా టార్చర్ అనుభవిస్తున్న హనీ రోజ్..
డబ్బున్న గర్వంతో ఎవరు ఎవరినైనా అవమానిస్తారా? దీనికి మన న్యాయవ్యవస్థలో ఆడవారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తే బాగుంటుంది అంటూ హనీ రోజ్ తెలిపింది. ఇకపోతే గత కొంతకాలంగా ఒక బిజినెస్ మాన్ తనను వేధిస్తున్నాడు అని, ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో..” నా పేరు వాడితే చాలు.. ఉచితంగా పబ్లిసిటీ వస్తుందనుకుంటున్నాడో ఏమో ఆ వ్యక్తి. ఎక్కడపడితే అక్కడ నన్ను మాటలతో వేధిస్తున్నాడు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేను అసలు ఈ వేధింపులను ఎందుకు సహించాలి? నాతోపాటు చాలామంది ఇతని బిజినెస్ కు సంబంధించిన ఈవెంట్లకి కూడా వెళుతూ ఉండేవాళ్ళం.. అయితే చాలా ఇంటర్వ్యూలలో అతడు నన్నే టార్గెట్ చేస్తున్నాడు. ప్రతిసారి కూడా నా పేరునే వాడుతూ.. ఇలా ఒకరి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది సంస్కారం అనిపించుకోదు. మొదట్లో అతడి మేనేజర్ నన్ను కలిసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇతడే కలుస్తున్నాడు. అప్పుడు ఎంతో మర్యాదగా మసులుకున్నాడు. కానీ ఒక పబ్లిక్ ఈవెంట్ లో నన్ను డబుల్ మీనింగ్ తో పిలవడంతో అసలు సంగతి నాకు అర్థం అయింది. ఇక ఒకసారి అతడు షాప్ కి వెళ్ళినప్పుడు కూడా మీడియా ముందు నాపై చాలా చులకనగా వ్యాఖ్యలు చేశాడు. అవి నన్ను చాలా అసౌకర్యానికి కూడా గురిచేసాయి. కానీ అప్పుడు అంత మంది ముందు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ప్రోగ్రాం నిర్వాహకులకు కాల్ చేసి నాపై ఇలా చీప్ గా కామెంట్లు చేస్తే సహించేది లేదని చెప్పాను.
సుదీర్ఘ పోస్ట్ విడుదల..
అప్పటి నుండీ అతడి ప్రోగ్రామ్స్ కి కూడా నేను వెళ్లడం మానేశాను. అయితే ఒకసారి నేను ఒక ప్రోగ్రాంకి వెళ్తే .. అక్కడికి అతడు గెస్ట్ గా వచ్చాడు.. నిజానికి అతడు వస్తున్న విషయం నాకు తెలియదు. ఇక దాంతో ఇద్దరం అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళాక నాతో అతడు డైరెక్ట్ గా మాట్లాడలేదు కానీ అందరి ముందు మళ్ళీ అవే దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. ఇక తర్వాత తన బిజినెస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆఫర్ ఇస్తే.. నేను కుదరన్నాను. అయితే అతడి మేనేజర్ కలగజేసుకొని ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని నాకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు. కానీ నేను మాత్రం అతడి ఆఫర్ను తిరస్కరించాను. ఒకవేళ ఇతడు ఇలాగే చిత్రవధ చేస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయిస్తాను” అంటూ హనీ రోజ్ తన పోస్టులో రాసుకుంది.