TTD Chairman :
⦿ టీటీడీలో ప్రక్షాళన మొదలైంది
⦿ నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి
⦿ శ్రీవాణి ట్రస్ట్ నిధులపై దర్యాప్తు చేస్తాం
⦿ అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు
⦿ చైర్మన్‌గా ప్రమాణం తర్వాత బీఆర్ నాయుడు వ్యాఖ్యలు
తిరుమల, స్వేచ్ఛ: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన మొదలైందని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం తిరుమల నూతన పాలకమండలి కొలువు దీరింది. ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నమయ్య భవనంలో నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ సీఎం ఆదేశాలు మేరకు టీటీడీలో ఇప్పటికే ప్రక్షాళన మొదలైంది. తిరుమలలో అన్యమత ప్రచార నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. అన్యమత ఉద్యోగులు కొనసాగింపుపై బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నా ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తిరుమల పవిత్రను కాపాడే విధంగా నిర్ణయాలు ఉంటాయి. శ్రీవాణి ట్రస్టు నిధుల మళ్లింపుపై సమగ్ర దర్యాప్తు చేస్తాం’ అని నాయుడు వెల్లడించారు.