BigTV English

TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?

TTD : టీటీడీ వ్యాపార కేంద్రంగా మారిందా?.. ఆ పీఠాధిపతుల ఆరోపణలేంటి?

TTD :


TTD : టీటీడీ ప్రపంచంలో అత్యంత ధనవంతమైన హిందూ క్షేత్రం. వేల కోట్ల ఆస్తులు టీటీడీకి ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఎన్నో భారత్ కార్పొరేట్ సంస్థల ఆస్తుల విలువ కంటే టీటీడీ సంపదే ఎక్కువ. టన్నల కొద్దీ బంగారం ఆ కలియుగ దైవానికి ఉంది. ఈ మధ్యే ఆ లెక్కలను టీటీడీ శ్వేతపత్రం రూపంలో వెల్లడించింది. అయితే ఆస్తుల విషయంలో అనేక వివాదాలు టీటీడీని చుట్టుముడుతున్నాయి. గతంలో స్వామివారి ఆభరణాలపై వివాదం నడిచింది. మళ్లీ ఇప్పుడు మరో వివాదం తిరుమలపై రేగింది.

తిరుమల ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంలా తయారైందని వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు ఆరోపించారు. ఆ పీఠాధిపతులు శ్రీవారి దర్శనం కోసం బుధవారం తిరుమల వచ్చారు. మహాద్వారం నుంచి దర్శనానికి అనుమతించమని కోరారు. పీఠాధిపతులను అనుమతించమని తమకు ఎలాంటి సమాచారం అంద లేదని భద్రతా సిబ్బంది తెలిపారు. ముందుగా లేఖ ఇచ్చినా అనుమతించారా అని ప్రశ్నిస్తూ పీఠాధిపతులు కాసేపు నిరసన చేపట్టారు.


విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి టీటీడీ వ్యవహారాలపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో రాజకీయ నేతలు, ధనవంతులకు మాత్రమే స్వేచ్ఛగా దర్శన భాగ్యం కలుగుతోందని ఆరోపించారు. తిరుమలలో సామాన్య భక్తులు స్వేచ్ఛగా వెళ్లి స్వామిని దర్శించుకునే పరిస్థితులు లేవన్నారు. అందుకే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులను రాజకీయాల్లోకి దించుతామని ప్రకటించారు. తిరుమలలో మార్పులు జరగకపోతే దేశవ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాథిపతుల ఆశీర్వాదంతో త్వరలో ఏపీలో కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తామని వెల్లడించారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభ పెడతామని తెలిపారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెల్లడిస్తామని శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వతస్వామి స్పష్టం చేశారు.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×