E-Paper
Advertisement

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు
Advertisement

Vizianagaram District: కీలక నేతలు పార్టీని వదిలిపెట్టడంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. కొత్త నేతలను ఇన్‌ఛార్జీలుగా నియమించడం మొదలుపెట్టింది. అయినా కేడర్ మాత్రం నేతల వెంటే వెళ్లిపోవడం ఆ పార్టీకి మింగుడుపడడం లేదు. తాజాగా మండలి ప్రతపక్ష నేత బొత్స సత్తిబాబు తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో షాక్‌లో ఉన్నారట బొత్స సత్తిబాబు.

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్

వైసీపీకి ఉత్తరాంధ్రలో కీలక నేతల్లో బొత్స సత్తిబాబు ఒకరు. తన రాజకీయ చతురతో ప్రతీ ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. తన మార్క్ రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి బొత్సకు సొంత మేనల్లుడు షాక్ ఇచ్చారు. ఆయన టీడీపీ వైపు వెళ్లిపోవడంతో తన చీపురుపల్లి నియోజకవర్గాన్ని తన కంట్రోల్ లోకి తీసుకోవాలని భావించారు. మొదట్లో సపోర్టు ఇస్తామని చెప్పిన నేతలు, ఇప్పుడు ఒకొక్కరు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. తాజాగా వైసీపీ‌కి మెరకముడిదాం మండలం, అందులోని వివిధ గ్రామాలకు చెందిన నాయకులు రాజీనామా చేయడం మింగుడుపడడం లేదు.

గ్రామ స్థాయి నుంచి మండలం వరకు నేతల మూకుమ్మడి రాజీనామాలు

Advertisement

వైసీపీ గ్రామ, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా బూత్ కమిటీ కన్వీనర్ సైతం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని నేతలు మీడియా సమావేశం ద్వారా బయటపెట్టారు. తామంతా మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను వెంట నడవాలని నిర్ణయించుకున్నామని తేల్చిచెప్పేశారు. రాబోయే రోజుల్లో ఇంకా పలు మండలాల నుంచి భారీ ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని ఆయానేతలు తెలిపారు. ఒకే రోజు 13 గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ వాదాల్లో ఉన్న వారు రాజీనామాలు చేయడంతో షాకయ్యారు బొత్స సత్యనారాయణ.

ALSO READ: నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

Advertisement

టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు చిన్న శ్రీనును బాటలో తాము నడుస్తామని తేల్చిచెప్పేశారు. త్వరలో వారంతా టీడీపీలో చేరనున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు బొత్స సత్యనారాయణ. జరుగుతున్న పరిణామాలు ఆయనకు మింగుడుపడడం లేదు. సొంత నియోజకవర్గంలో పార్టీ బలహీనపడటం వైసీపీకి ఇబ్బందిగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని నేతలు చర్చించుకుంటున్నారు. మేనల్లుడు వెళ్లి బొత్స ఏడిపిస్తే, ఇప్పుడు కేడర్ వంతైంది. రేపటి రోజున విజయనగరం జిల్లాల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Related News

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్‌లో విషాదం.. ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు!

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

Big Stories

Advertisement
×