E-Paper
Advertisement

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!

నేను అనుకుంటే వేల కోట్లు సంపాదించేవాడిని.. వైసీపీకి మంత్రి నారాయణ మాస్ కౌంటర్!
Advertisement

Minister Narayana: మంత్రి నారాయణ నెల్లూరు అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. విపక్షాల విమర్శలకు ఆయన ఇచ్చిన గట్టి కౌంటర్, నగరాభివృద్ధిపై ప్రకటించిన స్పష్టమైన ప్రణాళికలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

రాజకీయ విమర్శలు.. స్పందన

Advertisement

నెల్లూరు అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ. 3,500 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. వస్తున్న ఆదరణను చూడలేక వైసీపీ నేతలు చీప్ పాలిటిక్స్ చేస్తూ.. నాపై అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు. ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, రూ. కోట్లు సంపాదించాలనుకుంటే తన నారాయణ విద్యా సంస్థల ద్వారానే సంపాదించుకోవచ్చని స్పష్టం చేశారు. విమర్శలు చేసేవారు తమ స్థాయిని ఆలోచించుకోవాలని, లేకపోతే వారికే నష్టమని హితవు పలికారు.

అభివృద్ధి ప్రాజెక్టులు.. డెడ్‌లైన్లు

Advertisement

2028 జూన్ 12 నాటికి నెల్లూరును ‘గ్రీన్ సిటీ’గా, అలాగే దోమలు లేని నగరంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. వచ్చే ఏడాది జూన్ 12 నాటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిధులు వెనక్కి వెళ్లాయని, మళ్లీ వాటిని తీసుకువచ్చి పనులు వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలకు సీఎం రూ. 50,000 కోట్లు కేటాయించారని వెల్లడించారు.

మోడరన్ మార్కెట్ .. స్కూళ్ల ఆధునీకరణ

నవాబుపేట మార్కెట్ యార్డులో రూ. 60 కోట్లతో మోడరన్ మార్కెట్ నిర్మిస్తున్నామని, తొలిదశలో రూ. 13 కోట్లతో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. స్థానిక వ్యాపారులతో చర్చించి అందరికీ అనుకూలంగా ఉండేలా నిర్మాణాలు చేపడతామన్నారు. అంతేకాకుండా, నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను స్విమ్మింగ్ పూల్స్ సహా అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో మోడ్రనైజ్ చేస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు.

Also Read: మోదీ చేసే పనిలో 10% చేసినా కాంగ్రెస్ బతుకుతుంది- కిషన్ రెడ్డి

Tags

Related News

షాక్‌లో బొత్స సత్తిబాబు, సొంత అడ్డాలో వైసీపీ నేతల షాక్, మూకుమ్మడి రాజీనామాలు

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్‌లో విషాదం.. ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు!

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

Big Stories

Advertisement
×