E-Paper
Advertisement

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు, రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి, ఆళ్ల స్థాయిలో పోటీ ఇస్తారా?
Advertisement

Amaravati: రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి. సరిగ్గా వేయకుండా మనం మునిగిపోతాము. నేతలు వేసే అడుగులు జాగ్రత్తగా ఉంటాయి. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిపై ఫోకస్ చేశారు మాజీ సీఎం జగన్. ఈ క్రమంలో ఐదుగురు నేతల తర్వాత కొత్త వ్యక్తిని రంగంలోకి దించారు. అన్ని విధాలుగా వేణుగోపాల సోమిరెడ్డి సరైన వ్యక్తి అని భావించి ఆయనకు బాధ్యతలు అప్పటించారు వైసీపీ అధినేత.

లోకేష్ టార్గెట్‌గా జగన్ కొత్త ఎత్తులు

2029 ఎన్నికల లక్ష్యంగా ఇప్పుటి నుంచి పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత జగన్. అందుకే కీలకమైన నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను తెరపైకి తెస్తున్నారు. గతంలో ఎన్నికలకు ఆరు నెలలు ముందు అభ్యర్థులను ప్రకటించే జగన్, మరో రెండున్నరేళ్లకు ముందుగానే అభ్యర్థులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఇటీవల ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

మంగళగిరి నుంచి రంగంలోకి వేణుగోపాల సోమిరెడ్డి

Advertisement

శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా తమ్మినేని సీతారాం, చీపురుపల్లికి బొత్స సత్యనారాయణ, భీమిలికి బొత్స కూతురు ఇలా వరుసగా అభ్యర్థులను ఎంపిక చేసి ఆయా నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్నారు జగన్. వీళ్లతోపాటు ప్రతీ జిల్లాకు నాలుగైదు సీట్లకు సంబంధించి ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల జబితా రెడీ అయినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. విడతల వారీగా పేర్లు ప్రకటిస్తున్నారు వైసీపీ అధినేత.

ఆశ్చర్యపోయిన వైసీపీ నేతలు, శ్రేణులు

ఈసారి మంగళగిరి నియోజకవర్గంపై కన్నేశారు వైసీపీ అధినేత జగన్. అన్ని విధాలుగా బలమైన అభ్యర్థిని తెరపైకి తెచ్చారు. మంగళగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమించారు. ఈ మేరకు వైసీపీ ఎక్స్ వేదికగా ఓ ప్రకటన చేసింది. ఉన్నట్లుండి సోమిరెడ్డి నియమించడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు ఒక్కసారిగా షాకయ్యారు.  ఒక్కమాటలో చెప్పాలంటే వేణుగోపాల సోమిరెడ్డి ఐదో వ్యక్తి.

Advertisement

గత ఎన్నికల నుంచి ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి ఐదుగురు వ్యక్తులను మార్చారు వైసీపీ అధినేత. మంగళగిరి నియోజకవర్గానికి స్థానిక అభ్యర్థిగా తొలుత ఆళ్ల రామకృష్ణారెడ్డి అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో లోకేష్‌ని ఓడించినా, ఆయనకు కనీసం కేబినెట్‌లో చోటు దక్కలేదు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి ఆ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల ముందు మురుగుడు లావణ్యకి వైసీపీ టికెట్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆమె కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల తర్వాత వేమారెడ్డికి నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు.

ALSO READ: తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

ఇప్పుడు కొత్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి వంతైంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అన్నివిధాలుగా బలమైనవారు కావడంతో బాధ్యతలు అప్పగించినట్టు గుసగుసలు మొదలయ్యాయి. ఎన్నికలకు రెండేళ్లు ముందు నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తున్నట్లు ఆ నేతలు చెబుతున్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లడం, పాదయాత్రకు సమయం దగ్గరపడుతుండడంతో జగన్, ఇన్‌ఛార్జులను ఎంపిక చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

తుని ఉమెన్స్ కాలేజీలో ఫుడ్ కలకలం, సాంబారులో బల్లి వ్యవహారం, ఆసుపత్రిలో విద్యార్థినులకు చికిత్స

నిడదవోలులో మళ్లీ మొదలైన విగ్రహ వివాదం.. రంగంలోకి వంగవీటి రంగా కుమార్తె!

ఏపీలో మొట్టమొదటి తొలి ఫ్లయింగ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా..?

నాగలాపురం తహసీల్దార్ ఆఫీస్‌లో విషాదం.. ఫ్యాన్ ఊడిపడి యువకుడికి గాయాలు!

జగన్ గారూ.. సచివాలయ ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?- రాంగోపాల్ రెడ్డి

అన్నమయ్య జిల్లాకు భారీ షాక్.. రూ. 10,300 కోట్ల ప్రాజెక్ట్ రద్దుపై భూమన ఫైర్!

ఇంత దారుణమైన పాలన.. ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి!

Big Stories

Advertisement
×