India vs Afghanistan T20I series: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా విర్రవీగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కొమ్ములు విరిచింది బీసీసీఐ. ఆ సమయంలో నఖ్వీ సపోర్ట్ చూసుకుని, ఓవరాక్షన్ చేసినందుకు గాను ఇప్పుడు ప్రతీ కారం తీర్చుకుంది. టీమిండియాతో తాము వన్డేలతో పాటు టీ20లు ఆడతామని బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ కు సిద్ధమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇందులో భాగంగానే టీమిండియాతో జరిగే మూడు టీ20 ల షెడ్యూల్ ను కూడా ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించి.. బంగ్లాదేశ్ కు పంగనామాలు పెట్టింది.
టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ( India vs Afghanistan T20I series) మధ్య టి20 సిరీస్ షెడ్యూల్ తాజాగా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు మొత్తం మూడు టి20 లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టి20 సిరీస్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరగాల్సిన ఈ టోర్నమెంట్ ను బీసీసీఐ పక్కా ప్లానింగ్ తో… ఇండియాలోనే నిర్వహించనుంది.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు
ఇదే సెప్టెంబర్ మాసంలో టీమిండియాతో మూడు వన్డేలతో పాటు మూడు టీ20లు ఆడతామని బీసీసీఐకి ప్రతిపాదనలు పంపింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. అయితే దీనిపై ఆలోచన చేస్తామని చెబుతూనే… సడన్ గా ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ కన్ఫామ్ చేసుకుంది. అప్పట్లోనే ఇండియాతో టి20 సిరీస్ వాళ్ళ దేశంలో ఆడతామని రషీద్ ఖాన్ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే తాజాగా షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఆఫ్ఘనిస్తాన్. దీంతో బంగ్లా టూర్ రద్దు చేసుకున్న బీసీసీఐ… ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడనుంది. టైం చూసి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును దెబ్బ కొట్టింది బీసీసీఐ.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటలు విని ఇండియాలో పర్యటించలేదు బంగ్లాదేశ్. వరల్డ్ కప్ నే బహిష్కరించింది. హిందువులపై దాడుల నేపథ్యంలో అప్పట్లో బంగ్లాదేశ్ అలాగే ఇండియా మధ్య గ్యాప్ పెరిగింది. ఈ క్రమంలో ఇండియాలో పర్యటించి టి20 వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. కావాలనే బంగ్లాదేశ్ ను మొహ్సిన్ నఖ్వీ రెచ్చగొట్టి ఈ ప్రకటన చేయించాడని వార్తలు అప్పట్లో వచ్చాయి. అయితే ఇది మనసులో పెట్టుకున్న బీసీసీఐ.. ఇప్పుడు బంగ్లాదేశ్ కు షాక్ ఇచ్చింది అని అంటున్నారు.